Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఎల్లోరా » ఆకర్షణలు » బౌద్ధుల గుహలు

బౌద్ధుల గుహలు, ఎల్లోరా

11

గుహ నెం.1తవ్వకాలలో మొదటి గుహ ఇది. దక్షిణాదిన నిర్మించిన మొదటి బౌద్ధారామం. దీనిలో నాలుగు గదులు, మాత్రం ఉంటాయి. ఏ రకమైన శిల్పాలు లేవు.

గుహ నెం.2 బుద్ధుడి జ్ఞాపికలతో నిర్మించిన మరో గుహ ఇది. ఇది మెట్ల చివరి భాగంలో ఉంటుంది. దీనికి ఒక మంటపం మరియు దానిలో బుద్ధుని అసంపూర్ణ చిత్రాలు ఒక గ్యాలరీగా ప్రదర్శించబడతాయి. ఇక్కడ కనుగొనిన శిల్పాలు పెద్దవి మరియు అందంగా ఉంటాయి. వీటిలో లక్ష్మీ, పంచిక మరియు ఐశ్వర్య దేవత, హరితి మొదలైనవి చేరి ఉంటాయి.  

గుహ నెం.3చారిత్రాత్మకతలో దీనికి వేరు గుహలు సాటి రావు. దీనిలో కూర్చొని ఉన్న బుద్ధుడు అసంపూర్ణంగా కనపడతాడు. ఇక్కడే ఇంకా ఇతర బౌద్ధమత చిహ్నాలు, అలంకరణలు కనపడతాయి.  గుహ నెం.4ఒకప్పుడు ఈ గుహ రెండు అంతస్తులుగా ఉండేది. కాని ఇపుడు శిధిలావస్ధలో ఉంది. దీనిలో కూడా కూర్చుని ఉన్న బుద్ధుడి శిల్పం కనపడుతుంది.

గుహ నెం. 5 ఈ గుహ 117 అడుగుల లోతు మరియు 59 అడుగుల వెడల్పు కలిగి ప్రధానంగా ఒక బౌద్ధ విహారాన్ని తలపిస్తుంది. దీనిపేరు మహర్వాద. దీనిలో 20 గదులు బౌద్ధ సన్యాసులకొరకు నిర్మించారు. అందమైన బుద్ధ దేవాలయం ఉంటుంది. ఇక్కడే రెండు పొడవైన సన్నని బెంచీలు కలవు  

గుహ నెం.6ఈ గుహలో నలుచదరంగా ఒక హాలు ఉంటుంది. బోధిసత్వ చిత్రాలు మాత మహామయూరి మరియు తార చిత్రాలుంటాయి.

గుహ నెం.7ఈ గుహ ఇతర గుహలంత ప్రసిద్ధి కాదు. దీనిలో సాధారణ హాలు, స్తంభాలతో ఉంటుంది.  

గుహ నెం.8ఒకప్పటి బౌద్ధ విహారమైన ఈ గుహ విలువైన బుద్ధుడి శిల్పాలు కలిగి ఉంది. ఈ గుహ పూర్తి భాగాన్ని చూసి రావచ్చు.  గుహ నెం.9 ఈ గుహలో అందమైన మాత తారాదేవి తన భక్తులను ఒక ఏనుగు, ఒక పాము, అగ్ని మరియు ఓడ మునక వంటివాటినుండి రక్షిస్తున్న చిత్రం కనపడుతుంది. దేవాలయానికి పక్కనే ఒక టెర్రస్ కూడా ఉంటుంది.

గుహ నెం.10 ఈ గుహకు ప్రసిద్ధి చెందిన శిల్పి విశ్వకర్మ పేరు పెట్టబడింది. ఈ గుహను సుతర్ కా ఝోప్రా అంటే వడ్రంగి గుడిసె అని కూడా అంటారు. వడ్రంగులు ఈ గుహను దర్శించి విశ్వకర్మకు నివాళి అర్పిస్తారు. ఇక్కడే ఒక బుద్ధుడి మంటపాన్ని కూడా చూస్తారు. ప్రవేశ ద్వారం వద్దే, బుద్ధుడి విగ్రహాన్ని ధర్మకక్ర ప్రవర్తన ముద్రలో 11 అడుగుల ఎత్తు విగ్రహంగా చూస్తారు.

భారతదేశంలో చైత్య వంశస్దుల పాలన కాలం ప్రాముఖ్యతను ఈ గుహ వివరిస్తుంది.  గుహ నెం.11 (దో ధాళ్)దో ధాళ్ అంటే అర్ధం రెండు అంతస్తులు అని. అయితే ఈ గుహ మూడు అంతస్తులుగా ఉంటుంది. కాని నేల అంతస్తు పూర్తిగా కుంగిపోవటంతో ఇది రెండు అంతస్తులుగానే ఉంటుంది.  ఈ గుహలో కూడా బుద్ధుడు పద్మాసనం వేసి కూర్చున్న భంగిమతో విగ్రహం కనపడుతుంది. దీనితోపాటు, గణేశ, మాత దుర్గ ల విగ్రహాలు కూడా కనపడతాయి.  

గుహ నెం.12 (తీన్ ధాళ్)ఈ గుహ మహారాష్ట్ర లోని అన్ని బౌద్ధ విహారాలకంటే పెద్దది. అది మూడు అంతస్తుల పొడవు. వెడల్పైన ప్రవేశం కలిగి అతి పెద్ద ప్రాంగణం కలిగి ఉంటుంది. ఇక్కడ ప్రతి అంతస్తు చేరేందుకు వేరు వేరుగా మెట్లు కలవు. ఈ హాలులో అనేక స్తంభాలు మరియు బుద్ధుడి ఇతర దేవతల చిత్రాలు, శిల్పాలు ఉంటాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
15 Sep,Tue
Return On
16 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
15 Sep,Tue
Check Out
16 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
15 Sep,Tue
Return On
16 Sep,Wed