Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఎల్లోరా » ఆకర్షణలు » బ్రాహ్మణ గుహల సముదాయం

బ్రాహ్మణ గుహల సముదాయం, ఎల్లోరా

5

గుహ నెం.13  - ఈ గుహ చూచేందుకు అధిక ఆసక్తి కలిగి ఉండదు.  గుహ నెం. 14 ఈ గుహను రావణుడి గొయ్యి అంటారు. ఈ పేరు ఎలా వచ్చిందనేది ఇంకా పరిశోధిస్తూనే ఉన్నారు. ఈ ప్రదేశంలో దేవాలయం కాక అతి పెద్ద ప్రాంగణం   కూడా ఉంటుంది. ఈ దేవాలయంకు గుండ్రటి కాలిబాట ఉంటుంది. దేవాలయ గోడలకు వైష్ణవ మతపర చిత్రాలు చెక్కి ఉంటాయి. ఇతర గోడలకు మాత దుర్గ మరియు గజలక్ష్మీ దేవతల చిత్రాలు చెక్కబడి ఉంటాయి. ప్రాంగణ ప్రదేశంలో నాలుగు పెద్ద గుంటలు ఉంటాయి. ఈ గుహ ఈ ప్రాంతంలో ఇతర హిందు గుహలకు దోవతీస్తుంది. ప్రాంగణంలో మధ్యలో ఒక శివలింగం కూడా ఉంటుంది.  

గుహ 15 ఏక శిలతో చేసిన శిల్పాలుకల గుహ ఇది ఒకటే. ఈ గుహ విష్ణుమూర్తి దశావతారాలను కలిగి ఉంటుంది.  ఇక్కడే రెండు అంతస్తుల మండపం ఒకటి కలదు. ఇక్కడ పాలించిన రాజ వంశస్ధుల చరిత్రను కాలక్రమానుసారంగా చూడవచ్చు. ఈ ప్రాతినిధ్యాలు ఆసక్తికరంగా కొన్ని హిందు మరియు మరి కొన్ని బ్రాహ్మణులువిగా గోచరిస్తాయి. గుహ నెం.16ఎల్లోరాలో ఈ గుహ ఎంతో ప్రసిద్ధి చెందినది మరియు ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద తవ్వకం.  దీనికి కైలాస అని పేరు. ఇక్కడి దేవాలయంలో శివభగవానుడు ఉంటాడు.

ఈ దేవాలయం  చాళుక్య వంశస్ధులు వారి పాలనలో కట్టిన విరూపాక్ష దేవాలయాన్ని పోలి ఉంటుంది. ఈ గుహను మూడు భాగాలుగా విభజించారు. ప్రవేశం, దేవాలయం, నంది దేవాలయం మరియు దాని పరిసరాలు. పురావస్తు పై ఆసక్తి కలవారికి ఈ ప్రదేశం ఎంతో సమాచారం ఇస్తుంది మరియు ఆసక్తి కలిగిస్తుంది. ఈ గుహలో దేవాలయం, మంటపం, మరి కొన్ని అందమైన శిల్పాలు, అద్భుత స్తంభాలు, అన్ని నిర్మాణాలు కూడా ఏక శిలతో నిర్మిచినవే.   గుహ నెం. 21 ఈ గుహను రామేశ్వరం అంటారు. దీనిని అతి ప్రాచీన తవ్వకంగా చెపుతారు. దీనిలో వివిధ హిందూ దేవతల శిల్పాలుంటాయి.

ఇక్కడి దేవాలయం కూడా శివుడిదే. ఒక లింగం మరియు నంది ఉంటాయి. ఇతర గుహలలో వలెనే ఒక మంటపం కూడా ఉంటుంది. గోడలకు అందమైన దేవతా చిత్రాలు గంగ మరియు యమున, శివ పార్వతుల వివాహం మొదలైనవి ఉంటాయి.  ఇక్కడ ప్రదక్షిణకు అనుకూలం అయిన మార్గం కూడా ఉంటుంది.  గుహ నెం. 29దీనిని డ్యూమార్ లేనా అంటారు. ఈ గుహను సీతా కా నహాని అంటే సీత స్నానం చేసిన ప్రదేశం అని చెపుతారు. ఇక్కడే ఒక మడుగు కూడా ఉంది. హాలుకు నాలుగు ద్వారపాలకులు ఉంటారు. ఈ గుహ ముంబై లో కల ఎలిఫెంటా గుహలను పోలి ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
06 Aug,Thu
Return On
07 Aug,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
06 Aug,Thu
Check Out
07 Aug,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
06 Aug,Thu
Return On
07 Aug,Fri