Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» గాలిబోర్

గాలిబోర్ - అడవుల మధ్యలో ఉన్న అద్భుత పర్యాటక స్ధలం

5

కర్నాటకలోని బెంగుళూరుకు 110 కి.మీ. దూరంలో ఉన్న గాలిబోర్ ప్రకృతిలోని సహజ అందాలకు నిలయంగా ఉంటుంది. సంగం కు ఇది 10 కి.మీ. దూరంగా ఉంటుంది. ఆర్కావతి మరియు కావేరి నదుల సంగమం ఈప్రదేశం. ఈ ప్రదేశం నివాస ప్రదేశం కాదు. కావేరి వన్య ప్రాణ సంరక్షణాలయ అడవులు మధ్యలో కలదు.  గాలిబోర్ ప్రాంతం ఫిషింగ్ మరియు నేచర్ క్యాంపులకు ప్రసిద్ధి. కావేరి నది ఒడ్డున పచ్చటి చెట్ల నడుమ ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అక్కడే ఉన్న గాలిబోర్ అనే ఒక కొండ పేరును ఈ ప్రాంతానికి పెట్టారు. చుట్టూతా పర్వత శ్రేణులుంటాయి. కావేరి నది ఒడ్డున పచ్చని ప్రదేశంలో ఉంది.

గాలిబోర్ పై పర్యాటకులకు ఎందుకు ఆసక్తి కలుగుతుంది?  

ప్రకృతిమాత ఒడిలో ఒరిగి విశ్రాంతి పొందాలనుకునేవారు సెలవులు వచ్చేశాయంటే చాలు ఈ ప్రదేశానికి తరలి వెళతారు. చేపలు పట్టేందుకు అనువైన ప్రదేశం. చేపట గాలంలో నిపుణులు ఈ ప్రదేశాన్ని బాగా ఇష్టపడతారు. అయితే, ఈ ప్రదేశంలోని చేపలను పట్టుకోవడం మరల వదిలేయడం అనే సిద్ధంతంపైనే ఇక్కడ అనుమతిస్తారు. పట్టిన చేపను ఫొటో తీయడం, మరల దానిని నదిలో వదిలేయడం చేస్తారను.  జాలర్లు ఎక్కువగా మహసీర్ చేపలకు ప్రయత్నిస్తారను. ఈ చేప కావేరి నదిలో అధికంగా దొరుకుతుంది. దీనితో పాటు ఇంకా కార్ప్, కేట్ ఫిష్ వంటి చిన్న చేపలకు కూడా ప్రయత్నిస్తారు. జంతుజాలాలు, పక్షుల గమనం వంటివి కూడా చేస్తారు. గాలిబోర్ లో సుమారు 220 పక్షుల రకాలుంటాయని చెపుతారు. సెలవుల సమయంలో చాలామంది వచ్చి వీటిని గమనించి ఆనందిస్తారు.

సంబార్, మచ్చల లేడి, ఏనుగులు, చిరుతపులులు, అడవి ఎలుగులు, అడవి ఉడుతలు, మలబార్ అడవి ఉడుతలు, గుంట నక్కలు, కొండ చిలువలు, నాగుపాములు, వైపర్లు, వంటివి ఎన్నో గాలిబోర్ లో చూడవచ్చు. మొసళ్ళు , తాబేళ్ళు, ఊసర వెల్లులు సైతం మీకు కనపడతాయి.

గాలిబోర్ ఎపుడు సందర్శించాలి?  గాలిబోర్ లో బోట్ ప్రయాణాలుంటాయి. కనుక నీటి ఆట ఔత్సాహికులు అడవి లోతట్టు ప్రాంతాల నదిలోకి కూడా ప్రయాణించవచ్చు. గాలిబోర్ ను సందర్శించాలంటే జూన్ మరియు ఆగస్టు నెలలు అనుకూలం. ఈ సమయంలో నీటి ఆధారిత పక్షులు అనేకం అక్కడకు వస్తాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నుండి మే మధ్య వరకు చేపలు పట్టేందుకు అనుకూలమే.

గాలిబోర్ నగరానికి దగ్గర అవడంతో వివిధ కంపెనీల వారు ఈ విహార ప్రదేశంలో తమ సిబ్బందితో మీటింగులు సైతం పెట్టుకుంటారు. ట్రైనింగ్ ప్రోగ్రాములు పెడతారు. ఈ ప్రదేశానికి రోడ్డు సదుపాయం బాగా ఉండి. బెంగుళూరు నుండి కనకపుర సంగం రోడ్డు మీదుగా రెండు గంటలలో చేరవచ్చు.

గాలిబోర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

గాలిబోర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం గాలిబోర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? గాలిబోర్

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం - బెంగుళూరు నుండి గాలిబోర్ కు ప్రతిరోజూ బస్ లు సడుస్తాయి. ఇవి ఎంతో సౌకర్యంగా ఉంటాయి. భీమేశ్వరి గాలిబోర్ కు 16 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ నుండి కూడా టాక్సీలు, క్యాబ్ లలో గాలిబోర్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - గాలిబోర్ కు రైలు స్టేషన్ లేదు. మంధ్య రైలు స్టేషన్ సమీపం. 73 కి.మీ. దూరంలో ఉంటుంది. అయితే, గాలిబోర్ కు బెంగుళూరు రైల్వే స్టేషన్ ప్రధాన రైలు స్టేషన్. ఇక్కడినుండి దేశంలోని అన్ని నగరాలకు రైళ్ళు నడుస్తాయి. పర్యాటకులు ఈ రైల్వే స్టేషన్ నుండి టాక్సీలు, క్యాబ్ లు, బస్సుల ద్వారా గాలిబోర్ చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    గాలిబోర్ ఎలా చేరాలి? విమాన ప్రయాణం - బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం 146 కి.మీ. దూరంలో ఉంటుంది. ప్రపంచ పర్యాటకులు అంటే ఐరోపా, ఆసియా, అమెరికా మరియు మధ్య ప్రాచ్య పర్యాటకులు గాలిబోర్ ను బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా చేరవచ్చు. ఈ విమానాశ్రయం దేశంలోని ప్రధాన నగరాలనుండి కూడా కలుపబడింది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue

Near by City