ట్రెక్కింగ్ గోముఖ్ లో అత్యంత ప్రాచుర్యం పొందిన చర్యలలో ఒకటి. ప్రముఖ పర్వతారోహణ మార్గం గంగోత్రి వద్ద ప్రారంభమయి 22 కి.మీ.ల దూరం వెళ్ళాక గోముఖ్ వద్ద ముగుస్తుంది. కొన్నిసార్లు, ఇక్కడ భారల్స్ (హిమాలయ నీలం గొర్రెలు) అధిరోహకుల కంటపడతాయి. భుజ్ బాసా ఇక్కడ నుండి 4 కి.మీ.ల దూరంలో ఉంది. పర్యాటకులు గఢ్వాల్ వికాస్ నిగం లిమిటెడ్ బంగళాలో ఒక రాత్రి బస చేయవచ్చు. ఇక్కడ నుండి సుమారు 5 కి.మీ.ల ట్రెక్కింగ్ తరువాత, అధిరోహకులు గోముఖ్ చేరుకోవచ్చు. ఇక్కడ మంచు శిఖరాలు అతిథులకు సాదర స్వాగతం పలుకుతాయి. తపోవనం మరియు నందనవనం కి ట్రెక్కింగ్ గోముఖ్ నుండే మొదలవుతుంది.
ట్రెక్కింగ్ మార్గం భుజ్ బాసా దాటాక పెద్ద బండరాళ్లు మరియు భూపాతాల వలన మరింత సవాలుగా మారుతుంది; అందుకే, అధిరోహకులు మార్గదర్శకుల సహాయం తీసుకోవాలని సూచిస్తారు. తపోవనం వైపు అధిరోహణ ఇంకా కష్టతరం. అధిరోహకులు 2 కిలోమీటర్ల పరిధిలో 1500 అడుగుల ఎత్తును 70 డిగ్రీల వాలుతో అధిరోహించాలి. అందువలన, ఇది ప్రయాణీకులకి పెను సవాలును విసిరే అనుభవం.



Click it and Unblock the Notifications