Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గుహఘర్ » వాతావరణం

గుహఘర్ వాతావరణం

సందర్శనకు అనుకూల సమయం ఏది? గుహగర్ లో వాతావరణం కొద్దిపాటి వ్యత్యాసాలతో సంవత్సరం అంతా ఒకేమాదిరిగా ఉన్నప్పటికి వర్షాకాలం తదనంతరం మరియు శీతాకాలం పర్యటనకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ ప్రాంతంలోని ఆకర్షణీయ ప్రదేశాలు అన్నీ చూసి ఆనందించవచ్చు.

వేసవి

గుహఘర్ వాతావరణంవేసవివేసవి మార్చి నుండి మే నెల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీ సెంటీగ్రేడ్ గా ఉంటాయి. అరేబియా మహా సముద్రం పక్కనే ఉండటంచే గాలిలో తేమ అధికంగా ఉంటుంది. అయితే ఈ సీజన్ లో గుహఘర్ చక్కటి సన్ బేధింగ్ అవకాశాలను కలిగిస్తుంది.

వర్షాకాలం

వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ చివరి వరకు వర్షాకాలం ఉంటుంది. వర్షాలు భారీగా ఉంటాయి. అధిక వర్షాల కారణంగా ఈ కాలంలో గుహఘర్ పర్యటన సూచించదగినది కాదు.

చలికాలం

శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు శీతాకాలం కలదు. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు కనీసం 18 డిగ్రీ సెంటీ గ్రేడ్ గా ఉంటాయి. ఆహ్లాదంగా ఉండి పర్యటనకు స్వాగతిస్తాయి.