పర్వతారోహణ లో ఆసక్తి వున్న ప్రయాణీకులు ఓంబట్టు గుడ్డ కొండను చూడటానికి ఆసక్తి పడతారు. దీనికి ఆంగ్లంలో ‘నైన్ హిల్స్ ’ అని అర్థం (కన్నడలో ఓంబట్టు అంటే తొమ్మిది అని, గుడ్డ అంటే కొండ అని అర్ధం) అంటారు. ఆ పర్వతపు కొనకి తొమ్మిది వరస గుబ్బలు ఉండటంవల్ల ఆ స్థలానికి ఆ పేరు వచ్చింది.
ఇది సముద్ర మట్టానికి సుమారు 971 మీటర్ల ఎత్తులో ఉండి, పశ్చిమ కనుమల పరిధిలో ఎత్తైన శిఖరాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ స్థలం కబ్బినలే అటవీ ప్రాంతం తోనూ, షిరాది శ్రిస్ల అటవీ ప్రాంతం తోనూ, బాలూర్ అటవీ ప్రాంతం తోనూ చుట్టుముట్టబడి ఉంది.
ఇక్కడ స్థానికులను దారి అడిగేటప్పుడు ప్రయాణీకులు ముర్కల్ గుడ్డ అనే స్థానిక పేరుతో అడగాలి. ఈ స్థలం కబ్బినలే రిసర్వ్ ఫారెస్ట్ లోపల గుండియ చెక్ పోస్ట్ నించి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముందుగా ప్రయాణీకులను ఓంబట్టు గుడ్డ స్థావరానికి జీప్ సాయంతో చేరుస్తారు.
జీప్ లో వెళ్ళేటప్పుడు పర్యాటకులు అడవిలో చిరుత, కొండ దుప్పి, ఎలుగుబంది, అడవి ఏనుగు, గౌర్ లాంటి క్రూర జంతువులను చూడడానికి అవకాశం ఉంది. ఈ దారి అంతా కబ్బి హోల్ నది వెంట నడుస్తుంది, కాబట్టి ఆసక్తి వున్న వారు ఇక్కడ డైవింగ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications