హోగేనక్కల్ జలపాతాలు బెంగళూరు నుండి 180 కి.మీ ల దూరంలో తమిళనాడు ధర్మపురి జిల్లాలో కావేరి నది మీద ఉంది. దీనిని 'నయాగరా ఫాల్స్ ఆఫ్ ఇండియా' అని కూడా పిలుస్తారు. ఈ జలపాతాల నీటిలో ఔషధ గుణాలు ఉన్నాయి మరియు ప్రత్యెక బోటు రైడ్స్ కి ప్రాచుర్యం సంతరించుకున్నది. ఈ ప్రాంతంలో కనిపించే కార్బోనేట్ శిలలు ఆసియా లోనే కాదు, ప్రపచంలోకల్లా అతిపురాతనమైనవని భావిస్తారు. వేసవికాలంలో, ఈ జలపాతాల నీరు బలమైన ప్రవాహాలు లేని సమయంలో, ప్రత్యేక కొరాకిల్స్ (రౌండ్ పడవలు) ప్రయాణించేందుకు ప్రయాణికులు తీసుకుంటారు. అప్పుడే పట్టుకున్న తాజా చేపలను కొరాకిల్స్ లో కొనుక్కోవొచ్చు. ఇక్కడ త్రాగే నీటి పాకెట్లను మరియు స్నాక్స్ ను, ఇంకా అనేక రకాల వస్తువులను అమ్ముతుంటారు. ఇక్కడ అప్పుడే పట్టుకున్న తాజా చేపలను కొనుక్కొని వంటకం తయారు చేసుకుంటారు.



Click it and Unblock the Notifications