జబల్పూర్ లో అత్యంత ఆకర్షనీయమైన పర్యాటక ప్రాంతం పాలరాతి శిలలు, భేదాఘాట్. ఈ ప్రదేశం జబల్పూర్ అనే పేరుకే పర్యాయంగా మారింది అంటే అతిశయోక్తి కాదు. ఈ పాలరాతి శిలలు వందల అడుగుల ఎత్తులో నర్మదా నదికి అటు ఇటు నిలబడి ఉంటాయి. ప్రతి ఒక్కరు ప్రశాంతత ని కోరుకుని ఈ ప్రదేశానికి సందర్శిస్తారు. ఈ పాలరాతి శిలల పైన పడి పరావర్తనం చెంది సూర్యరశ్మి నర్మదా లో కనపడటం ఒక అద్భుత దృశ్యం. అదే విధంగా రాత్రి పూట పాలరాతి శిలల పైన పడి పరావర్తనం చెందే వెన్నెలని నర్మదా లో చూస్తూ పడవ షికారు చెయ్యడం జీవిత కాలపు అనుభూతి.



Click it and Unblock the Notifications