జగాద్రి పట్టణం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ యమునా కాల్వ ఒడ్డున వున్న బూరియా పురపాలక సమితి కలిగిన చిన్న పట్టణం. బీర్బల్ ద్వారంగా చెప్పబడే చిన్న నిర్మాణం కూడా వుండడం వల్ల అక్బర్ దర్బార్ లోని తెలివికల మంత్రి బీర్బల్ ఈ ప్రాంతాన్ని ఏలాడని కూడా చెప్తారు.
బూరియా భారత స్వాతంత్ర్యానికి పూర్వం రతన్ అన్ మోల్ సింగ్ ఏలిన రాజ్యం అని చరిత్ర చెప్తుంది. ఈ రాజుగారి వంశీకులు ఇప్పటికీ బూరియాలోనే నివసిస్తున్నారు. బూరియా లో పాతాళేశ్వర్ మహాదేవ శివాలయం, సనాతన్ ధర్మ హనుమాన్ మందిర్ తో పాటు తొమ్మిదో సిఖ్ గురువు తేజ్ బహదూర్ స్మారకార్ధం నిర్మించిన గురుద్వారా లాంటి చాలా ధార్మిక ఆకర్షణలు కూడా వున్నాయి.



Click it and Unblock the Notifications