Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జమ్మూ » ఆకర్షణలు » రఘునాథ్ టెంపుల్

రఘునాథ్ టెంపుల్, జమ్మూ

2

ఈ ప్రాంతం లో ప్రధాన ఆకర్షణల లో ఒకటైన రఘునాథ్ టెంపుల్ ను జమ్మూ పూర్వపు రాజులు మహారాజ రన్బీర్ సింగ్ మరియు ఆయన తండ్రి మహారాజ గులాబ్ సింగ్ లు నిర్మించారు. ఈ టెంపుల్ నిర్మాణం 1851 లో మొదలై 1857 వరకు కొనసాన్గింది. ఈ యాత్రా స్థలం రానా బీరేశ్వర్ టెంపుల్ మరియు పానిజ్ బఖ్తర్ టెంపుల్ ల తో పాటు ఒక కాంప్లెక్స్ లో కలదు.

రఘునాథ్ టెంపుల్ వద్ద 7 చారిత్రక గుడులు కలవు. ఈ దేవాలయ ప్రధాన దేవతలు హిందూ దేవుళ్ళు అయిన సూర్యుడు, శివుడు, , విష్ణువుల అవతారాలుగా వుంటారు. దేవాలయ నిర్మాణ తీరు మొఘల్ శిల్ప తీరు ను చూపుతుంది. ఆంజనేయుడి విగ్రహం, రానా బీర్ విగ్రహం వంటివి కూడా ఈ కాంప్లెక్స్ లో చూడవచ్చు. రఘునాథ్ టెంపుల్ లోని బంగారు పూత అలంకరణలు మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తాయి.

రఘునాథ దేవాలయం లో వివిధ హిందూ దేవుళ్ళ, దేవతల విగ్రహాలు, శివ లింగం వుంటాయి. దేవాలయ గోడలపై కొన్ని పవిత్ర లేఖనాలు వున్నాయి. టెంపుల్ కాంప్లెక్స్ లోని ఒక సంస్కృత లైబ్రరీ, లో పురాతన గ్రంధాలు, అరుదైన తాళపత్ర గ్రంధాలు చూడవచ్చు. కనుక భక్తులకే కాదు, చరిత్ర శోధించే వారికి కూడా ఈ ప్రదేశం ఆసక్తి కరంగా వుంటుంది.

ముబారక్ మండి పాలసు జమ్మూ

ముబారక్ మండి పాలసు పూర్వపు డోగ్రా రాజుల నివాసం. పాలసు నిర్మాణం లో యూరప్, బారోక్, రాజస్థాని, మొఘల్ నిర్మాణ శైలి లు కనపడతాయి ఈ కాంప్లెక్స్ ప్రధాన ఆకర్షణ షీష్ మహల్. ముబారక్ మండి పాలసు లో డోగ్రా ఆర్ట్ మ్యూజియం ఒకటి పింక్ హాల్ లో కలదు. అందంగా అలంకరచించబడిన హాలులు, గేలరీ లు ఇపుడు వివిధ అధికార సందర్భాలకు, వేడుకలకు వాడుతున్నారు . ఒకప్పుడు రాజులు ఉపయోగించిన ప్రాంగణం , తోట వంటి వాటి తో ఈ పాలసు ఒక పురాతన నగరాన్ని తావి నది వద్ద చూపుతుంది. ప్రభుత్వ కోర్టులు, కార్యాలయాలు కలిగిన ఒక చారిత్రక, పురావస్తు ప్రాధాన్యత కల ప్రదేశంగా ముబారక్ మండి పాలసు ప్రకటించబడింది.

మానసార్ లేక్, జమ్మూ

మానసార్ లేక్ పర్యాటకులలో మానస సరోవర్ యొక్క ఒక పవిత్ర స్థలంగా పేరు గాంచినది. అందమైన ఈ సరస్సు సుమారు ఒక మైలు పొడవు, అర మైలు వెడల్పు వుంటుంది. చుట్టూ పచ్చని దట్టమైన అడవులు వుంటాయి. హిందువుల దేముడు అయిన స్నేక్ గాడ్, శేష నాగు ఈ నది ఒడ్డున కూర్చుని ఉంటాడు.

స్థానిక విశ్వాసాలు ల మేరకు కొత్తగా పెళ్లి అయిన జంటలు శేష నాగు ఆశీర్వాదం కొరకు ఇక్కడకు వచ్చి మూడు ప్రదక్షిణలు ఈ సరస్సు చుట్టూ చేస్తారు. అదృష్టం వరిస్తుందని భావిస్తారు. ఈ సరస్సు పై మరో నమ్మకం ఏమంటే దాని లో స్నానం చేస్తే వారి పాపాలు తొలిగి పోతాయని కూడా భావిస్తారు. మానసార్ లేక్ లో పర్యాటకులు బోటింగ్ కూడా చేస్తారు.

ఇక్కడ శేష నాగు టెంపుల్ మాత్రమే కాక, పర్యాటకులు దుర్గా టెంపుల్, పార్వతి శివ లేదా ఉమాపతి మహాదేవ టెంపుల్, నరసింహ టెంపుల్ వంటివి కూడా ఇక్కడ చూస్తారు. ఈ సరస్సు సమీపం లో ఒక వన్య సంరక్షణాలయం కూడా వుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Jun,Fri
Check Out
20 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat