శివ ఖొరి ని మరో పేరుగా 'దేవుళ్ళ ఇల్లు ' అని కూడా అంటారు జమ్మూ లో ఇది ప్రసిద్ధ గుహ టెంపుల్. ఇక్కడి శివ లింగం సహజంగా ఏర్పడినది అని చెపుతారు. ఈ శివ లింగం సుమారు 150 మీటర్ల ఎత్తు వుంటుంది. ఈ ప్రాంతం లో ఈ గుడి ని అందరూ భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈ టెంపుల్ మరో ఆకర్షణ గా 4 అడుగుల పొడవు తో స్వయంభూ లింగం వుంటుంది. ఈ స్వయంభూ శివ లింగం ఎల్లప్పుడూ సిలింగ్ పై నుండి పడే తెల్లని ద్రవం తో తడుస్తూ వుంటుంది. గుహ గోడలపై సహజంగా చిత్రీకరించిన దేవుళ్ళ చిత్రాలు కూడా చూడవచ్చు.