Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» జంజ్గిర్-చంప

జంజ్గిర్-చంప - గొప్ప వారసత్వం!  

13

1998వ సంవత్సరం మే నెల 25 న ఏర్పాటు చేసిన జంజ్గిర్-చంప జిల్లా, ఛత్తీస్ ఘడ్ మధ్యలో ఉంటుంది. అందువలనే దీనిని ఛత్తీస్ ఘడ్ హృదయం అంటారు. ఆహారధాన్యాల ఉత్పత్తిలో ఒక ముఖ్య పాత్రను పోషించినందున, ఇది రాష్ట్రంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలలో ఒకటి. జంజ్గిర్-చంప, కుల్చురి వంశానికి చెందిన జజ్వల్య మహారాజు నగరంలో ఉంది.

ఈ జిల్లాలో నివసించే స్థానికులు దాదాపుగా చుట్టుపక్కల ఉండే గ్రామాల నుండి వచ్చినవారే. జంజ్గిర్-చంప జిల్లాలోని ప్రాంతాలు స్థానిక కులాలకు చెందిన కహ్రాపర, ఖలేపర, భటపర వంటి పేర్లను కల్గి ఉంటాయి.

ఈ జిల్లాలో చేపట్టిన హస్డియో-బంగో ప్రాజెక్టు జంజ్గిర్-చంప లోని ¾ వంతు గ్రామాలకు నీటి పారుదల సదుపాయం కల్గించి, ఎంతో మేలు చేస్తుంది. ఇది ఒక ముఖ్య వ్యావసాయిక జిల్లాయే కాక తాజా వ్యవసాయ సరఫరాలకు, సున్నపురాయికి కూడా ప్రసిద్ది చెందింది.

ప్రాచీనతతో కూడిన సంస్కృతికి ప్రసిద్ధి చెందిన జంజ్గిర్-చంప, పట్టణ చరిత్రను ప్రతిబింబించే గొప్ప సంస్కృతిని కూడా కల్గి ఉంది. ఒక ఆసక్తికరమైన నిజమేమిటంటే, ఈ జిల్లా టైటానిక్ ఓడ దుర్ఘటనలో మరణించిన అన్నీ ఫంక్ అనే ఒక క్రైస్తవ మతబోధకురాలికి నివాసం. ఇప్పటికి ఆవిడ ఇంటి అవశేషాలను చూడటానికి సందర్శకులను అనుమతిస్తున్నారు.

జంజ్గిర్-చంప లోనూ, చుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలు

జంజ్గిర్-చంపలో ఉన్న అనేక ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో విష్ణు మందిరం, లక్ష్మీనారాయణ ఆలయం, అద్భార్, నహరియ బాబా ఆలయం, దుర్గా దేవి మందిరం, శివరినారాయణ ఆలయం, చంద్రహాసిని ఆలయం వంటివి ఉన్నాయి. మదనపురఘర్, కన్హర, పిథంపూర్, దేవర ఘట, దముధర, ఘటదాయితో కూడిన అనేక పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి. పై తెలిపిన ప్రాంతాలలో విష్ణు ఆలయం ఎంతో ప్రసిద్ధి కారణం జంజ్గిర్-చంప లోని పురాతన కళాత్మక సంస్కృతిని ఇది చాటి చెప్తుంది.

జంజ్గిర్-చంప వాతావరణం

ఛత్తీస్ ఘడ్ లోని మిగిలిన ప్రాంతాలలానే జంజ్గిర్-చంపలో ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. వేసవి సాధారణంగా ఏప్రిల్, జూన్ మధ్య ఉంటుంది. వేసవిలో వేడిగా, తేమగా ఉండే వాతావరణం శీతాకాలంలో ఎంతో చల్లగా మారిపోతుంది.

జంజ్గిర్-చంప చేరడం ఎలా

జంజ్గిర్-చంపను రోడ్డు, రైలే కాక విమాన మార్గాల ద్వారా సులువుగా చేరే వీలున్నందున పర్యాటకులకు ఈ పట్టణాన్ని చేరడం అనేది అతి తేలికైన పని.

జంజ్గిర్-చంప ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

జంజ్గిర్-చంప వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం జంజ్గిర్-చంప

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? జంజ్గిర్-చంప

  • రోడ్డు ప్రయాణం
    బస్సు మార్గం జంజ్గిర్-చంప జిల్లా జంజ్గిర్ దగ్గర ఉంది. దీనిని అనేక రవాణా మార్గాల ద్వారా చేరవచ్చు. ఇది బిలాస్పూర్ నుండి 65 కిలోమీటర్లు, రాయపూర్ నుండి 175 కిలోమీటర్ల దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం జంజ్గిర్-చంప, హౌరా-ముంబై ప్రధాన మార్గం పై ఉండటమే కాక, ఆగ్నేయ -మధ్య రైలు మార్గానికి కూడా అనుసంధానం కల్గి ఉంది. నైల, చంప ఈ జిల్లాలోని రెండు రైలు స్టేషన్లు. రాజధాని నగరం రాయపూర్, జంజ్గిర్ జిల్లా నుండి 170 కిలోమీటర్ల దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమానమార్గం రాజపూర్ విమానాశ్రయం, జంజ్గిర్-చంప కు అతి దగ్గరగా ఉంది. ఇది అన్ని ప్రధాన స్థానాలకు మార్గాన్ని కల్గి ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed