జయపూర్ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో వుండే కోరాపుట్ ఒడిశాలోని ముఖ్యమైన పట్టణాల్లో ఒకటి. ఇక్కడి ప్రాకృతిక అందానికి, అద్భుతమైన వన్యప్రాణులకు, కోరాపుట్ లోని దట్టమైన అడవుల్లో వుండే గిరిజనులకు ఈ ప్రాంతం ప్రసిద్ది చెంది౦ది.
ఈ గిరిజన ప్రజలను ‘ ఆదివాసీలు’ లేదా ‘అసలైన స్థానికులు’ గా పిలుస్తారు. ఈ ప్రాంతంలో పారిశ్రామికీకరణ జరగడంతో ఎలాగో ఇక్కడి ప్రజలు ఇప్పుడు కొత్త జీవన విధానాలను అలవాటు చేసుకున్నారు. చాల పురాతనమైన జగన్నాధ స్వామి దేవాలయం ఇక్కడ వుంది.
కుల మత భేదాలకు అతీతంగా ఈ గుడిలోనికి అందరినీ అనుమతించడం విశేషం. ప్రతి ఏటా ఈ స్వామి ఆశీస్సుల కోసం వేలాదిగా భక్తులు ఇక్కడికి వస్తారు.
మచకుంద్, కొలాబ్, బన్సీధర్ లాంటి ప్రధాన నదులు కోరాపుట్ గుండా బంగాలాఖాతంలోకి కలుస్తాయి. ఇక్కడి వైవిధ్య భరితమైన ఫల వృక్ష జాతులు, దట్టమైన లోయలు, బ్రహ్మాండమైన పర్వతాలు, జలజల జారే జలపాతాలు కోరాపుట్ ను ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మార్చాయి.



Click it and Unblock the Notifications