1432 AD లో నిర్మించారని భావించే బాహుబలి ఏకశిలా విగ్రహం కర్కల పట్టణం ప్రధాన ఆకర్షణగా పరిగణించబడుతోంది. 42 అడుగుల ఎత్తుగల ఈ బాహుబలి ఏకశిలా విగ్రహం కర్నాటకలోని రెండవ పెద్ద విగ్రహం (మొదటిది శ్రావనబెలగోల లోని 55.77 అడుగుల గోమతేశ్వర విగ్రహం).
బాహుబలి, గోమటేశ్వర ఏకశిలా ఖండ విగ్రహాన్ని యువరాజు బాహుబలి జ్ఞాపకార్ధం పాండ్య రాజైన వీరపాండ్య భైరవ నిర్మించారని స్థానికుల నమ్మకం. ప్రసిద్ధ జానపద కదల ప్రకారం, బాహుబలి ఒక రాజకుమరుడిగా ప్రాపంచిక విషయాలను వదలివేసి, తన జీవితంలో 12 సంవత్సరాలు ధ్యానంలో గడిపాడు.
దేశం మొత్తం మీద 12 సంవత్సరాలకి ఒకసారి జరిగే మహామస్తకాభిషేకం రోజున బాహుబలి ఏకశిలా ఖండం ప్రత్యేకంగా జైన్ భక్తులతో క్రిక్కిరిసి ఉంటుంది. ఈ పండుగ రోజు, ఏకశిలా ఖండ విగ్రహానికి నీటితో, కుంకుమపువ్వు పేస్టు తో, పాలతో అభిషేకం జరుగుతుంది.



Click it and Unblock the Notifications