నరసింగ్ జి టెంపుల్ నరసింహ స్వామి కల ఒక ప్రాచీన దేవాలయం. 1600 సంవత్సరాల చరిత్ర కల ఈ టెంపుల్ కథువా జిల్లాలో ఘగ్వాల్ టవున్ లో కలదు. ఈ టెంపుల్ లో మూడు విగ్రహాలు కలవు. అవి నర్సిన్ఘ అవతార్, నరసిన్ఘ రూప మరియు అన్నపూర్ణ . ఈ మూడు విగ్రహాలు కలిపి నర్సిన్ఘ జి టెంపుల్ ఆఫ్ ఘగ్ వాల్ లో చూడవచ్చు. ఈ టెంపుల్ సమీపం లో ఒక పెద్ద నీటి కొలను కూడా వుంటుంది.
ఈ టెంపుల్ కాంప్లెక్స్ లో టూరిస్టులు బాబా నరహరి దాస్ జి మహారాజ్ సమాధిని కూడా చూడవచ్చు. భక్తులు ఇక్కడ ఒక మహా మండలేశ్వర్ గద్ది కూడా చూడవచ్చు. ఈ ప్రదేశంలో బ్రేక్ ఫాస్ట్, లంచ్ మరియు డిన్నర్ లు సుమారు 200 మందికి ప్రతి రోజూ పెడతారు.
మకరసంక్రాంతి, రథ ఖర మరియు జన్మాష్టమి పండుగలకు భక్తులు అధిక సంఖ్య లో వస్తారు. ప్రత్యేక సందర్భాలలో ఇక్కడి గిరిజనులు ఒక సంత ను నిర్వహించి దుప్పట్లు, హస్త కళల వస్తువులు, వూలేన్ బట్టలు వంటివి విక్రయిస్తారు.



Click it and Unblock the Notifications