అస్సాం లోని సోనిత్పూర్ జిల్లాలో గోహ్పూర్ పట్టణం ఉంది. గోహ్పూర్ చిన్న పట్టణమే అయినప్పటికీ చారిత్రికంగా ఎంతో గొప్పది. ప్రసిద్ద స్వాంతంత్ర్య సమరయోధురాలు కనకలతా బారువ పుట్టినది ఈ పట్టణం లోనే. అభిమానంతో బీర్బల అని పిలిచే కనకలతా బారువను 1942 లో క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా జాతీయ జెండా పట్టుకొని ఉన్నందుకు కాల్చి చంపారు.
దండి దేవాలయం, గోహ్పూర్ అభయారణ్యం, బోర్ పుఖురి వంటి కొన్ని ఆసక్తికరమైన ప్రదేశాలు గోహ్పూర్ లో ఉన్నాయి. కాజీరంగా జాతీయ పార్కు బయటి సరిహద్దు నుండి గోహ్పూర్ కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉంది.
కాజీరంగా జాతీయ పార్కును సందర్శించే పర్యాటకులు గోహ్పూర్ ను సందర్శించి సాయంత్రం పార్కును చేరే విధంగా తమ ప్రణాళికను రూపొందించవచ్చు. గోహ్పూర్ చేరడానికి పర్యాటకులకు అద్దె టాక్సీలు ఉంటాయి. పూర్తి రోజు కోసం ఒక కారును మాట్లాడుకొంటే సులువుగా వెనక్కి కూడా రావచ్చుననేది సూచించబడినది.



Click it and Unblock the Notifications