ఖీచన్ పక్షుల అభయారణ్యం, ఖీచన్ గ్రామంలోని ఒక వలస పక్షుల నివాసం.ఈ సహజ అభయారణ్యంలో ఐరోపా నైరుతి ప్రాంతం, నల్ల సముద్ర ప్రాంతం, పోలాండ్, యుక్రెయిన్, కజాఖస్తాన్, ఉత్తర దక్షిణ ఆఫ్రికా, మంగోలియా నుండి వచ్చే మూడు రకాల కుర్జన్, కర్కర, కుంచ అనే పక్షుల రకాలు ఉన్నాయి. ఐరోపాలోని శీతాకాలపు చలినుండి తప్పించుకోవడానికి భారత దేశానికి వలస వచ్చే ఈ పక్షులను అక్టోబర్ నుండి మార్చ్ మధ్య కాలంలో ఈ అభయారణ్యంలో చూడవచ్చు.ప్రతి ఏడాది భారీ సంఖ్యలో ఈ పక్షులు భారతదేశానికి వచ్చినప్పటికీ, నాలుగు నుండి ఆరు వేలు మాత్రమే ఖీచన్లోని ఈ పక్షుల అభయారణ్యానికి వస్తాయి. కుర్- కుర్ అనే ఒక విలక్షణమైన ధ్వని చేసే కుర్జన్, 4 - 6 కిలోల బరువుతో మూడు అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఇవి చేసే ఈ విలక్షణమైన ధ్వని వలన స్థానిక భాషలో వీటిని కుర్జన్ అని పిలుస్తారు. ఈ పక్షికి గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఎక్కువ దూరాలకు ఎగరగల సామర్ధ్యం ఉంది. కుర్జన్ లకు గల విలక్షణమైన లక్షణాల వలన ఇవి ఎంతో ఆకర్షణీయంగా కనబడతాయి.
ప్రతి ఏడాది ఈ పక్షులను చూడటానికి ఇక్కడకు వచ్చే ప్రకృతి ప్రియులలో ఖీచన్ పక్షి అభయారణ్యం ఎంతో ప్రసిద్ది చెందింది.



Click it and Unblock the Notifications