ఫోర్ట్ కొచ్చి లో ఉన్న భారతీయ నావెల్ మారిటైమ్ మ్యూజియం భారత నావికాదళానికి చెందినది. ఈ మ్యూజియం ని సందర్శించడం వల్ల మన సైనిక దళాల ఆకట్టుకునే చరిత్ర ని తెలుసుకోవడం తో పాటు సందర్శకులకి గొప్ప ప్రేరణ కలుగుతుంది. భారత నావికా దళానికున్న శక్తికి ఈ మ్యుజియం అద్దం పడుతుంది.
భారత నావికా దళం సేకరించిన వివిధ టోకెన్ ల ని చూసి మీరు ఆశ్చర్యంలో మునిగిపోతారు. ఈ టోకెన్ లు మన నావికా దళాలు సాధించిన విజయాలకు గుర్తులు. ఆశాజనకమైన నావికా దళాల భవిష్యత్తు గురించి సాధించిన కీర్తి గురించి తెలుసుకోవడానికి ఈ మ్యూజియం అనువైన ప్రదేశం.
1965 మరియు 1971 లో పాకిస్తాన్ తో జరిగిన యుద్దాల్లో భారత నావికా దళం ప్రధాన పాత్ర పోషించింది. మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే భారత నావికా దళం మరో రెండు ప్రధాన ఆయుధ దళాలైన సైనిక దళాలు మరియు వైమానిక దళాలతో కలిసి పాకిస్తాన్ పై విజయం సాధించింది.



Click it and Unblock the Notifications