ఆహారం, కళలు మరియు ప్రశాంతమైన వాతావరణం మిళితమైన ప్రదేశంగా కాశి ఆర్ట్ కేఫ్ ని చెప్పుకోవచ్చును. మెరుగైన నిర్వహణతో అద్భుతమైన ఆహార పదార్ధాలు, కళాత్మక ప్రదర్శనలు మరియు ఆహ్లాదకరమైన వాతావరణం సందర్శకుల ని కాశి ఆర్ట్ కి ఆకట్టుకునే అంశాలు. 1997 లో ఈ కాశి ఆర్ట్ కేఫ్ ఏర్పాటయింది. ప్రజలు కలుసుకునేందుకు, భావాలు పంచుకునేందుకు ఇది ఆహ్లాదకరమైన ప్రదేశం.
ఎన్నో రకాల ఆహార పదార్ధాలు ఇక్కడ లభిస్తాయి. వాటిలో డార్క్ చాక్లెట్ కేక్స్, తాజాగా తయారు చేసిన అప్పాలు, నోరూరించే రుచికరమైన సాండ్విచ్ లు, వివిధ రకాల సలాడ్స్ మరియు వేడి వేడి సూప్ లు మొదటి స్థానంలో ఉంటాయి. అంతే కాదు చక్కటి టీ మరియు కాఫీ లు కుడా లభిస్తాయి.
పర్యాటకులకి ఈ అద్భుతమైన రుచులు ఆహ్వానం పలుకుతాయి. ఫోర్ట్ కొచ్చి లో ని బర్గర్ స్ట్రీట్ లో ఈ కేఫ్ ఉంది. సులభం గా ఈ కేఫ్ కి చేరుకొనవచ్చు. ప్రపంచంలో నలుమూలల నుండి కళాకారుల యొక్క పనితనాన్ని ప్రదర్శించే కళాప్రదర్శన శాల కూడా ఉంది. భారత దేశంలో ని ఔత్సాహిక యువ కళాకారులకి శిక్షణ అందిస్తారు కూడా. సందర్శించే రోజులు : ఈ కేఫ్ ని వారంలో ఏ రోజైన సందర్శించవచ్చు. సమయం : ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకుమూసివేసే రోజులు : జూన్ 1 నుండి జూన్ 31 వరకు మూసివేయబడును.



Click it and Unblock the Notifications