మ్యూజియం అఫ్ కేరళ హిస్టరీ కొచ్చి కి 10 కి మీ ల దూరం లో ఉంది. మాధవన్ నాయర్ ఫౌండేషన్ అని కూడా దీనిని పిలుస్తారు . సంపన్నమైన మరియు విభిన్నమైన కేరళ చరిత్రకి ఈ మ్యుజియం అద్దం పడుతుంది. దేవతల స్వంత ప్రదేశంగా భావించబడే ఈ ప్రదేశం యొక్క చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఈ మ్యూజియం సందర్శించడం ఒక చక్కటి మార్గం.
విష్ణు మూర్తి ఆరవ అవతారమైన పరశురాముడి భారీ విగ్రహం గుడి ప్రవేశ ద్వారం వద్ద మనకి కనిపిస్తుంది. పరశురాముడు తన గొడ్డలిని అరేబియన్ సముద్రంలో పడవేసినప్పుడు కేరళ ఉద్భవించిందని పురాణాలు చెప్తున్నాయి. కేరళ పుట్టుకనుండి ఆధునిక కాలం వరకు, కేరళ రాష్ట్రానికి సంబంధించిన చరిత్ర ఈ నాలుగు గోడల మ్యుజియం లో మనం తెలుసుకోవచ్చు.
2000 సంవత్సరముల చరిత్ర కలిగిన కేరళ వైభవం గురించి కాంతి మరియు ధ్వని ప్రదర్శనల ద్వారా ఈ మ్యూజియం లో తెలుసుకోవచ్చు. చరిత్రపై మమకారం కలిగిన వారికైనా లేదా చిన్న పిల్లలకైనా ఒక గంట పాటు ఉండే ఈ ప్రదర్శన చూడడం వల్ల జీవితకాలపు అనుభూతి మిగుల్తుంది.



Click it and Unblock the Notifications