కొడంగలూర్ లో మరో ధార్మిక ప్రదేశం కురుంబకవు ఆలయం. ఇక్కడ యుద్ధ దేవత భగవతి అమ్మవారు వెలసారు. ఎనిమిది చేతుల్లో ఆయుధాలతో భగవతి విగ్రహం వైభవోపేతంగా ఉంటుంది. దారుకాసురుని తల, గంటలు, కడియం, ఒక పాత్రలోని రక్తం అమ్మవారి రూపాన్ని అలంకరిస్తాయి.ఆలయ ప్రాంగణం లో వసూరిమల, తవిట్టుమూర్తి ల ప్రతిమలు కూడా ఉన్నాయి. ఉత్సవ కాలం లో వందలాది భక్త జనం ఇక్కడికి విచ్చేస్తారు. కవుతీన్ డళ్ అని కూడా పిలవబడే భరణి వేడుక ఈ ఆలయంలోని ముఖ్య ఉత్సవం.కురుంబకవు ఆలయం లో ఎన్నో పురాణాలు, గాథలు దాగి ఉన్నాయి. కన్నగి చరితం , దారుక నిగ్రహం ( దారుక వధ) ఇందలి ముఖ్యమైన రెండు కథలు. ప్రార్థన లు , మంత్రాలు ఇక్కడి పరిసరాల్లో భక్తి భావాన్ని నింపి పర్యాటకుల మనుస్సులకు స్వాంతన చేకూరుస్తాయి.



Click it and Unblock the Notifications