మర్ తోమా పాంటిఫికల్ చర్చి అని కూడా పిలవబడే మర్ తోమా చర్చి కొడంగలూర్ లోని చారిత్రాత్మక చర్చి. ఇది సెయింట్ థామస్ విచ్చేసిన ప్రదేశం గా నమ్మబడే అళికోడ్ లో ఉంది. ఈ చర్చి వెనుక చరిత్ర ని అనుసరించినట్టయితే కేరళలో క్రైస్తవానికి తొలిరోజుల దాకా వెళుతుంది. అందుచేత దీనికి ధార్మిక ప్రాముఖ్యత తో పాటు చారిత్రిక విశిష్టత కూడా ఉంది. భారతీయ-పెర్షియన్ శైలిలో నిర్మించబడ్డ ఈ చర్చి అద్భుతమైన హస్తకళా చాతుర్యానికి, నిర్మాణ నైపుణ్యానికి ప్రతీక. సెయింట్ థామస్ కి చెందిన పురాతన శేషాలు పుజావేదిక లో భద్రం చేయబడ్డాయి. కొన్ని ప్రత్యేక సందార్భాల్లో ఇవి ప్రజా వీక్షణ కి ప్రదర్శించబడతాయి. సెయింట్ థామస్ జీవితాన్ని చూపే చిన్న చలన చిత్రం ప్రదర్శించబడుతుంది. "క్రీస్తు రాకను గుర్తించిన సెయింట్ థామస్" అనే ఘట్టాన్ని వర్ణించే ప్రతిమ గుడి ముందు భాగంలో ఉంది. సెయింట్ థామస్ ఆగమనాన్నిచూపించే అద్భుత చిత్తరువు మరొక ఆకర్షణ. చర్చి ప్రధాన పండగ ప్రతి ఏటా నవంబర్ 21 న జరుపుతారు.



Click it and Unblock the Notifications