శ్రుంగపురం మహాదేవ ఆలయం కొడంగలూర్ పట్టణానికి సమీపంలోనే ఉన్న వాసికెక్కిన శివాలయం. ఋష్యశృంగుడు అనే మహర్షి ఇక్కడ శివుని విగ్రహం ప్రతిష్టించడం వల్ల ఈ ప్రాంతానికి శ్రుంగపురం ( శ్రుంగ యొక్క ప్రదేశం) అనే పేరు వచ్చిందన్నది స్థలపురాణం.పార్వతి దేవి లేకుండా పరమశివుడు కొలువుండటం ఇక్కడి విశిష్టత. సతీ దేవి ఆత్మాహుతి వల్ల కలిగిన బాధ తో ఇక్కడ శివుడు బాధాయుత మనస్థితి లో ఉంటాడు. 10 వ, 11 వ శతాబ్దాలకి చెందిన కళాత్మక శిలా శాసనాలతో నిండి ఇక్కడి గోడలు అద్భుతంగా ఉంటాయి.ఆలయ ప్రాంగణంలో పెంకుల పైకప్పు గల నాదపండల్, ధ్వజస్తంభం, ప్రాకారం, గర్భగుడి ఉన్నాయి. కేరళ లో అన్ని ప్రాంతాల నించి భారీ సంఖ్య లో భక్తులు శివరాత్రి పర్వదినాన ఇక్కడికి చేరుకుంటారు. కొడంగలూర్ - పరవుర్ రహదారి పై ఉన్న శ్రుంగపురం మహాదేవ ఆలయం ని రహదారి ద్వారా చేరుకోవటం సులభసాధ్యం.



Click it and Unblock the Notifications