ఛత్రపతి శాహూ మహారాజ్ నేపధ్యానికి నేరుగా సంబంధం వున్న భవానీ మండపం కొల్హాపూర్ లోని అందమైన భాగం. కొల్హాపూర్ నిర్మాణంగా భావించే ఈ పురాతన కట్టడం ఈ నగర వైభవంగా పిలువబడుతుంది.కొల్హాపూర్ స్వయం ప్రతిపత్తి సాధించిన సందర్భంలో అప్పటి రాజు రెండో శివాజీ దీన్ని నిర్మించాడు. ఈ మండపం భవానీ దేవత కోసం నిర్మించారు. 14 చదరాలతో మొదట్లో నిర్మించిన ఈ మండపం లో ముస్లిం దండయాత్రల వల్ల ఏడు శిధిలమైపోయాయి.ఈ మండపం లోని ఆవరణం చాలా పెద్దది, గంభీరమైనది. ముఖద్వారం లో శాహూ మహారాజ్ విగ్రహాన్ని, ప్రాసాదం అంతటా సూక్ష్మంగా చెక్కిన దీపాలు, ఆభరణాలు అలంకరించి వుండడం చూడవచ్చు.



Click it and Unblock the Notifications