రాజస్ధాన్ లోని ఇతర ప్రదేశాలవలెనే, కుంభాల్ ఘర్ లో కూడా అందమైన ప్యాలెస్ లు ఉన్నాయి. వాటిలో బాదల్ మహల్ ఒకటి. దీనిని మేఘాల ప్యాలెస్ అని అంటారు. దీనిలోనే మర్దనా మహల్ మరియు జనానా మహల్ అనేవి కలవు. ప్యాలెస్ లోని సుందరమైన గదులు పేస్టెల్ రంగు కుడ్య చిత్రాలచే అలంకరించబడ్డాయి.
ఈ గదులు వారి ప్రత్యేక ఎయిర్ కండిషనింగ్ విధానాన్ని తెలుపుతాయి. చల్లని గాలి గదులలోకి రావడం, వేడి గాలి బయటకు పోవడం వంటి విధానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. పర్యాటకులు జనానా మహల్ లో ఆనాటి రాణులు సభా కార్యక్రమాలను చూసేటందుకు తమ ఘోషా కొరకు ఉపయోగించిన రాతి జాలీలను కూడా చూడవచ్చు.



Click it and Unblock the Notifications