కచ్ ఉప జిల్లాలో లఖ్ పత్ అనేది చిన్న పట్టణం. లఖ్ పత్ టౌన్ అనగా "లక్షాధికారి పట్టణం" అని అర్ధం. 18 వ శతాబ్దానికి చెందిన లఖ్ పత్ కోట నాలుగు గోడల మధ్య ఈ పట్టణం ఉంది. గుజరాత్, సించ్ లని కలిపే ఈ పట్టణం ముఖ్య వాణిజ్య కేంద్రము.1819 లో వచ్చిన భూకంపం వల్ల సింధూ నది ఈ పట్టణం నుండి దూరం గా ప్రవహించడం మొదలుపెట్టడం వల్ల ఈ పట్టణ అభివ్రుద్ధి కుంటు పడింది.
అయినా ఈ పట్టణాన్ని సందర్శకులు ఎక్కువ గా సందర్శిస్తూనే ఉంటారు. 1801 వ సంవత్సరంలో జమాదార్ ఫతే మహమ్మద్ ద్వారా నిర్మించబడ్డ పట్టణ నలుపక్కలా ఉన్న నాలుగు గోడలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. మాలిన్యాలు లేనటువంటి ఎడారి గాలి వల్ల రాత్రి పూట ఆకాశం అధ్భుతం గా ఉంటుంది. ఈ సుందర ప్రదేశం లో సూర్యోదయ సూర్యాస్తమయాలు తప్పక చూడదగ్గవి.



Click it and Unblock the Notifications