సురు నది వల్ల ఏర్పడిన సురు లోయ, దాని సహజ సౌందర్యంకై పర్యాటకులలో ప్రసిద్ధి చెందింది. ఈ లోయలో టిబెటన్ మరియు బౌద్ధ దర్ద్ సామాజిక వర్గ వారసులుగా భావింపబడే సుమారు 25,000 మంది నివాసితులు ఉన్నారు.స్వతహాగా టిబెట్ బౌద్ధులైన ఈ ప్రాంత ప్రజలు, 16 వ శతాబ్దం నుంచి షియా మహమ్మదీయ మతాన్నిఅనుసరిస్తున్నారు.
సందర్శకులు లోయ దిగువ భాగం నుండి కున్ మరియు నన్ పర్వతాల అద్భుత వీక్షణ పొందుతారు. సురు లోయ చుట్టూ జాంస్కర్ మరియు పాదుం వంటి ఇతర పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. సందర్శకులకు సమీపంలో ఉన్న రంగ్దుం వద్ద వసతి అందుబాటులో ఉంటుంది.