అమిని ద్వీపం అసలు లక్షద్వీపాలు అంటే ఏమిటో చూపుతుంది. అసలు సిసలు విశ్రాంతి ప్రదేశ అనుభవాలను కలిగిస్తుంది. చిన్నది, కోడి గుడ్డు ఆకారం లో కల ఈ ద్వీపం సుమారు ౩ కి. మీ. ల పొడవు, ఒక కి. మీ. వెడల్పు కలిగి వుంటుంది. దీనిలో నివాసితులు వుంటారు.
ఈ ద్వీపం లోను మరియు చుట్టుపక్కల ప్రసిద్ధ సెయింట్ ఉబెదుల్లా ఇస్లాం మతాన్ని ప్రచారం చేసాడు. ఇక్కడ కల రిసార్ట్ లు అందమైన కృత్రిమ చెక్క ల అంతస్తులతో అలంకరించ బడి, మీకు ఎంతో మధురమైన విశ్రాంతి అనుభవాలను ఇస్తాయి. అంతే కాదు. మీరు ఈ డెక్ ల నుండి సూర్యోదయ , సూర్యాస్తమయ దృశ్యాలు చూడవచ్చు.
ఆగట్టి నుండి ఒక అద్దె బోటు లో అమిని చేరవచ్చు. ఆగట్టి ద్వీపం ఇండియా ప్రధాన భూభాగం పడమటి తీరానికి వాయు మార్గం లో అనుసంధానించా బడి వుంది. ఆగట్టి లక్షద్వీపాలకు స్థానిక విమానాశ్రయం కూడాను.



Click it and Unblock the Notifications