మరాఠా పాలకుల చరిత్ర కలిగిన ఈ శ్రీవర్ధన్ కోట రాజమాచి నగరానికి తూర్పు వైపున వుంది. ఔత్సాహిక శిల్ప ప్రేమికులు వెంటనే మరాఠా శైలి నిర్మాణాలను గుర్తిస్తారు. ఇక్కడినుంచి కొండ దిగువన కదలికలను చూడగలిగేలా ఈ కోటను రాజమాచి శిఖరాల్లోని ఒక దాని మీద నిర్మించారు. పరుచుకున్న పచ్చదనంతో వుండే ఈ కొండ ప్రాంతంలో కోటనుంచి ఈ దృశ్యం చాలా పసందుగా ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు.