లోనావాలా లో ప్రసిద్ది చెందిన పెద్ద విహార కేంద్రం బుషీ జలాశయం. ఇది అందమైన భూభాగాలు, దట్టమైన చెట్ల నేపధ్యంలో నెలకొని వుంది.లోనావాలా లో అందరూ చూడాలని కోరుకునే ఈ జలాశయం మీ ఇంద్రియాలకు హాయి గొల్పే చక్కటి విహార కేంద్రం. వర్షాకాలంలో ఈ జలాశయం లోంచి నీరు విడుదలయ్యేటప్పుడు కొన్ని జలపాతాలు కూడా ఏర్పడి చూడ్డానికి చాలా బాగుంటుంది.