మీకు పర్వతారోహణ చేయాలనే ఉత్సాహం ఉంటె, మహారాష్ట్ర లోని ప్రఖ్యాత పర్వతారోహణ కేంద్రం రాజమచి వెళ్ళండి. మీరు పర్వతారోహణకు కొత్త అయినా పశ్చిమ కనుమలు, సహ్యాద్రి శ్రేణులు తేలికపాటి నుండి కష్టంగా వుండే అన్ని పర్వతారోహణ అనుభవాలను అందిస్తాయి. ఔత్సాహికులకు రాజమచి నుండి ఖండాలా పీఠభూమికి, తుంగర్లి సరస్సుకి, లోనావాలాకు పర్వతారోహణ ఒక సవాలుగా అనిపిస్తుంది. ప్రయాణీకులు రాజమాచి నుండి కొనదన గుహలు లేదా ఉల్లాస్ నది తీరం గుండా కూడా చేరుకోవచ్చు.అసాధారణ సహజ ఆకర్షణలతో కలిసిన ఈ పర్వతారోహణ ఎప్పటికీ మీ జ్ఞాపకాల్లో ఉండి పోతుందని రుజువు చేస్తుంది. ప్రసిద్ధ మధ్యయుగ కోటలు చేరుకోవడానికి కొండల మధ్య ప్రయాణం జీవితకాల౦ వుంచుకోదగ్గ జ్ఞాపక౦.లోనావాలా లో వాతావరణం సంవత్సరం పొడవున ఆహ్లాదకరంగా, ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇక్కడి హాయిగొల్పే వాతావరణం ఏ ఇతర ఉష్ణమండల స్వర్గధామం కన్నా బాగుంటుంది. అందం, సరదా రెండూ కలిసి పర్యాటకుడికి మరిచిపోలేని విహారయాత్ర ను అందిస్తుంది లోనావాలా.లోనావాలా ను సంవత్సరంలో దాదాపు ఏ సమయంలో నైన సందర్శించ వచ్చు, ఐతే ఈ పర్వత ప్రాంతాన్ని అక్టోబర్ నించి మే మధ్య సందర్శించడానికి ఉత్తమ సమయం, ఎందుకంటే ఆ సమయంలో వాతావరణం హాయిగా ఉంటుంది.



Click it and Unblock the Notifications