మహారాజ రంజిత్ సింగ్ యుద్ధ మ్యూజియం, అద్భుతమైన సైనికులకు నివాళులు అర్పించేందుకు పంజాబ్ ప్రభుత్వం చే 1999 లో స్థాపించబడింది. GT రహదారిపై (లుధియానా-అమ్రిత్సర్ జాతీయ రహదారి) ఉన్న ఈ మ్యూజియం, లుధియానా రైల్వే స్టేషన్ నుండి షుమారు 6.7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మ్యూజియం ప్రవేశద్వారం వద్ద మహారాజ రంజిత్ సింగ్ అతిపెద్ద విగ్రహం ఉంది. సందర్శకులు
ఈ విగ్రహం పక్కన, INS విక్రాంత్ భారీ నమూనాతోపాటు పాత ఆయుధాలను కూడా చూడవచ్చు. అలాగే ఈ మ్యూజియంలో లైట్, సౌండ్ ప్రదర్శనలు కూడా నిర్వహిస్తారు. సందర్శకులు పరమవీర చక్ర, మహావీర్ చక్ర, వీర చక్ర వంటి ప్రతిష్టాత్మక ధైర్యసాహసాలకు చెందిన అవార్డులు స్వీకరించిన పంజాబీల పలు చిత్రాలను చూడవచ్చు. బ్రిటిష్ కాలం నాటి భారత రక్షణ దళాల యూనిఫాంలు కూడా ఇక్కడ ప్రదర్శించబడతాయి.



Click it and Unblock the Notifications