GT రహదారిపై (లుధియానా-జలంధర్ జాతీయ రహదారి) ఉన్న టైగర్ సఫారీ, ప్రధాన నగరం నుండి 6 కిలోమీటర్ల దూరంలో 25 కంటే ఎక్కువ ఎకరాలలో విస్తరించి ఉంది. సందర్శకులు ఈ ప్రదేశంలో పులులు, నల్ల కొంగలు, కుందేళ్ళు, సంబర్లు, నెమళ్ళను చూడవచ్చు. పులులు ఈ జూలో బోనులో ఉండడానికి బదులుగా చుట్టుపక్కల ప్రదేశంలో తిరగడం చూడవచ్చు. వైల్డ్ లైఫ్ శాఖవారు ఈ ప్రదేశాన్ని సందర్శించే బాధ్యతను ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. ఈ సఫారీ సోమవారం తప్ప మిగిలిన రోజులలో తెరిచే ఉంటుంది, మంగళవారం వాటి నిర్వహణ కోసం మూయబడి ఉంటుంది. ప్రయాణీకులు టైగర్ సఫారీ, హార్డిస్ వరల్డ్, మహారాజ రంజిత్ సింగ్ యుద్ధ మ్యూజియం ని ఒకేసారి చూడవచ్చు.