Search
  • Follow NativePlanet
Share

మలానా - నిర్మలమైన వాతావరణం మరియు సంపన్న సంస్కృతి!

11

మలానా ధారాళమైన మలానా నది ఒడ్డున, సముద్ర మట్టానికి 3029 మీటర్ల ఎత్తులో ఉంది. కులు లోయకి సమీపంలో ఉన్న మలానా, డియో తీబా మరియు చంద్రఖని శిఖరాల మంత్రముగ్దమైన దృశ్య వీక్షణ అందిస్తుంది.

మలానా లో జనాభా తక్కువగా ఉంటుంది. ఇక్కడ మాట్లాడే స్థానిక భాష “కానాషి”, సంస్కృతం మరియు టిబెటన్ మాండలికాల మిశ్రమం. నగర జీవిత ఇంద్రజాలంచే తాకబడకపోవటం చేత, మలానాలో స్థానికుల జీవనశైలి చాలా సరళంగా ఉంటుంది.

ఇక్కడి ప్రధాన దైవం జాముల రిషి దేవత యొక్క 11 ప్రతినిధులచే గ్రామ పరిపాలన నిర్వహించబడుతుంది. ఈ ప్రతినిధులు, దేవత పేరు మీదుగా నిర్ణయాలు తీసుకుంటారు. వారి ఆదేశాలకు ఆక్షేపన ఎదురవదు.

మలానా , నిర్మలమైన వాతావరణం మరియు సంపన్న సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. “మలానా - పోయిన విలక్షణత: ఒక హిమాలయ గ్రామ ప్రపంచీకరణ” మొదలగు అనేక లఘుచిత్రాలు మలానా పై చిత్రీకరించారు. ఈ ప్రాంతపు స్థానికులు, తమ సంప్రదాయాలను తూచా తప్పకుండా అనుసరించడం, ఇక్కడి అతి ముఖ్యమైన లక్షణం. స్థానికుల నమ్మకం ప్రకారం, మలానా గ్రామాన్ని మాసేడాన్ యొక్క అలెగ్జాండర్ III సైన్యం లోని సైనికులు స్థాపించారు. మలానాలో నివశించేవారు ఆర్యుల వారసులని నమ్ముతారు.

“మలానా జల విద్యుత్తు స్టేషన్” అని పిలువబడే ఒక ఆనకట్ట ప్రాజెక్టు, గ్రామ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించింది. యాత్రికులు మలానాకు చేరువలో ఉన్న మహదేవ్ ఆలయం సందర్శించవచ్చు. స్థానికుల సంస్కృతి మరియు వారు అనుసరించే ఆచారాలను గ్రహించడానికి, వారితో సంభాషించటమే ఉత్తమ మార్గం. మలానా లో, ప్రయాణికులకు ట్రెక్కింగ్ మరియు అలాంటి ఇతర చర్యలు అందుబాటులో ఉంటాయి. గ్రామస్తుల వస్తువులను తాకరాదని సూచిస్తారు. అది అపరాధముగా పరిగణించబడుతుంది.

మలానా సమీపంలోని విమానాశ్రయం 25 కి.మీ.ల దూరంలో ఉన్న కులులో ఉంది. కులు విమానాశ్రయం, నేరుగా పఠాన్ కోట్,కొత్త ఢిల్లీ, చండీఘర్, ధర్మశాల మరియు సిమ్లా వంటి ప్రధాన నగరాల యొక్క విమానాశ్రయాలతో అనుసంధానించబడింది. అంతర్జాతీయ ప్రయాణికులు నేరుగా కొత్త ఢిల్లీ విమానాశ్రయం నుండి కులు కి విమానాల ద్వారా చేరుకోవచ్చు. జోగిందర్ నగర్ రైల్వే స్టేషన్ మలానా కు సమీపంలోని రైల్వే స్టేషన్. అది చండీగఢ్ రైల్వేస్టేషన్ ద్వారా ప్రముఖ నగరాలతో కలపబడింది. అనేక ప్రైవేట్ మరియు ప్రభుత్వ బస్సులు, కులు నించి మలానా కి నిత్యం నడపబడుతున్నాయి.

మలానా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మలానా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మలానా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మలానా

  • రోడ్డు ప్రయాణం
    రహదారి: రోడ్డు ప్రయాణం చేయాలి అనుకున్నపర్యాటకులు చండీగఢ్ లేదా ఢిల్లీ నుండి కులు కి బస్సులో చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం: మలానా నుండి 125 కి.మీ. దూరంలో ఉన్న జోగిందర్ నగర్ రైల్వే స్టేషన్, సమీప రైల్వేస్టేషన్. ఇది నేరుగా భారతదేశం యొక్క ప్రధాన నగరాలకు కలపబడిన చండీగఢ్ రైల్వేస్టేషన్ తో అనుసంధానించబడింది. యాత్రికులు సౌకర్యవంతంగా మలానా చేరుకోవడానికి రైల్వే స్టేషన్ వెలుపల నుండి క్యాబ్లు మరియు టాక్సీలు అద్దెకు లభిస్తాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    మలానా ప్రాంతం రహదారి, రైలు మరియు వాయు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. విమానయానం: సుమారు 25 కి.మీ.ల దూరంలో ఉన్న కులు విమానాశ్రయం మలానాకు దగ్గరలో ఉన్న విమానాశ్రయం. ఇది ఢిల్లీ, చండీఘర్, పఠాన్ కోట్, ధర్మశాల మరియు సిమ్లా వంటి ప్రధాన నగరాల విమానాశ్రయాలతో అనుసంధానించబడింది. విదేశాల నుంచి వచ్చే యాత్రికులు కొత్త ఢిల్లీ నుండి కులు కి కలిపే విమానాల ద్వారా చేరుకోవచ్చు. మలానా చేరుకోవడానికి, విమానాశ్రయం వెలుపల నుండి కారు లేదా టాక్సీ అద్దెకు తీసుకొనవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Sat
Return On
26 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Sat
Check Out
26 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Sat
Return On
26 Apr,Sun