దుర్గా అమ్మవారి అవతారమైన కామాక్షి దేవికి అంకితమివ్వబడిన కామాక్షి దేవి ఆలయం మండి జిల్లాలో ఉన్న కావో గ్రామం లో ఉన్న ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రం. మహిషాసురుడిని దుర్గమ్మ వారు ఈ ప్రాంతం లో ని వధించారని పురాణాలు చెబుతున్నాయి. హిందూ పర్వదినాలైన అయిన 'నవరాత్రి' రోజులలో ఈ ఆలయం లో గేదెల్ని బలి చేస్తారు. సాంప్రదాయక పాగోడ నిర్మాణ శైలి లో ఉన్న ఈ ఆలయ నిర్మాణం, అందమైన చిత్రలేఖనాలు, కొయ్య బొమ్మలు పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తాయి. కర్సోగ్ నుండి 7 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications