మండి జిల్లాలో ఉన్న షికారి పీక్ లేదా షికారి దేవి పీక్ సముద్ర మట్టం నుండి 11500 అడుగుల ఎత్తులో ఉంది. ఈ జిల్లాలో ఉన్న అతి పెద్ద శిఖరం ఈ షికారి పీక్. షికారి దేవి కి అంకితమివ్వబడిన ఆలయం ఇక్కడి ప్రధాన ఆకర్షణ.
ఈ ప్రాంతానికి పర్యాటకులు భుల్లా నుండి ట్రెక్కింగ్ మర్గాలు మొటారబెల్ రోడ్ల నుండి ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఈ మార్గాలు శీతాకాలం మరియు వర్షాకాలం లో మూసి ఉంచబడుతాయి. ఉన్నతమైన డియోడార్ వృక్షాలకి అలాగే విస్తరించిన పచ్చిక బయలకి భుల్లా ప్రసిద్ది. ఈ ప్రాంతం లో కనిపించే వివిధ రకాల వృక్ష మరియు జంతు జాలం పర్యాటకులకి కనువిందు చేస్తాయి. ఇక్కడ కనిపించే అరుదైన పక్షులలో మోనాల్ అందరినీ అమితంగా ఆకర్షిస్తుంది.