మండి కి విచ్చేసిన పర్యాటకులు ఆనందించే మరొక ముఖ్యమైన ఆక్టివిటీ షాపింగ్. భారతీయ సాంప్రదాయ హస్త కళాకృతులు, వెండి ఆభరణాలు అలాగే రాతి శిల్పాలకి ఈ ప్రాంతం ప్రసిద్ది.
సాంప్రదాయ టిబెటన్ వస్తువులు అమ్మే టిబెటన్ షాపులు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. శీషం మరియు డియోడార్ చేక్కలపై చేసే పహారీ వుడ్ వర్క్, వివిధ హిందూ దేవతల వర్ణనలు ఇక్కడ ప్రసిద్ది. ఒకప్పుడు టిబెట్ యొక్క ప్రవేశ ద్వారంగా వ్యవహరించిన మండి శతాబ్దాలుగా వ్యాపారుల యొక్క పట్టణంగా ప్రాచుర్యం పొందింది.



Click it and Unblock the Notifications