జామా మసీద్ ను 1454 లో ఘోరి వంశ పాలకులు నిర్మించారు. చక్కని కాలి నడక మార్గాలు, స్తంభాలతో ఈ ప్రార్ధనా ప్రదేశం ప్రతి ఒక్కరికి ప్రశాంతతను అందిస్తూ చారిత్రక ప్రాధాన్యత కలిగి వుంది. ఈ మసీద్ భవనం డమాస్కస్ మసీదు భవనాన్ని పోలి వుంటుంది.
ఈ మసీద్ నిర్మాణ శైలి పస్థూన్ శిల్ప శైలి కలిగి వుంటుంది. జామి మసీద్ అంటే గొప్ప మసీదు అని అర్ధం చెపుతారు. దీని గొప్పతనం సైజు లోనే కాదు నిర్మాణ శైలి లో కూడా కలదు. పెద్ద బయలు ప్రదేశాలు, అనేక స్తంభాలు, గొప్ప ద్వారాలు గతంలోని వారి వైభవాన్ని చాటుతాయి. మత పరంగానే కాక ఈ నిర్మాణం చరిత్ర లో కూడా ఒక గొప్ప స్థానం పొందింది.



Click it and Unblock the Notifications