దేవకుండ్ అని కూడా పిలువబడే ఈ దేవకుండ్ దేవీ దేవతల స్నానపుతొట్టె అని అర్ధం. ఇది బరిపడ వెలుపల దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఈ ప్రాంతం దాని సున్నితమైన లక్షణాలతో పేరుకి తగ్గట్టుగా ఉంది. దేవకుండ్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడాల పట్టణంలో ఎంతో ఐకమత్యంతో పండుగలు జరుపుకుంటారు. జనవరిలోజరిగే పంటకోత పండుగ సంక్రాంతి సమయంలో దేవకుండ్ సందర్శించడం ఉత్తమం. దేవకుండ్ లో ఆధ్యాత్మిక భావంతో జరుపుకునే ఈ పండుగలు, వేడుకలు సందర్శకుల అందరి హృదయాలను చూరగొంటాయి.
దేవకుండ్ పైనించి కనపడే అందమైన దృశ్యాల కోసం ఇక్కడికి చేరతారు. పసిద్ది చెందిన ఈ దృశ్యాలు రోజువారీ అలసట మధ్య మనసులో ధృడమైన స్పూర్తితో కూడిన ప్రశాంతతను దూరంచేసి, ఆధ్యాత్మిక వైరాగ్యాన్ని కలిగిస్తాయి.
ఈ జలపాతం పైన ఉన్న దేవకుండ్ అంబిక ఆలయం ఆ ప్రాంతం చుట్టూఉన్న విస్తృత దృశ్యాలను అందిస్తుంది. అయితే ఈ అంబిక విగ్రహం మయూర్భంజ్ బరిపడ లోని అంబిక ఆలయానికి తరలించబడింది.