ఈ నగరం లోని మోకోక్చుంగ్ పార్క్ లేదా టౌన్ పార్క్ అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రదేశం. ఇక్కడ ప్రశాంతత పొందటమే కాక ప్రక్రుతి యొక్క అందాలను ఆస్వాదించవచ్చు. నగరంలోని ముఖ్య ప్రదేశం లోని ఈ పార్క్ అనేక పర్యాటకులని ఆకర్షిస్తుంది. ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్ నుంచి నగరాన్ని ఆసాంతం విహంగ వీక్షణం చెయ్యవచ్చు. ఈ పార్క్ లో ఒక సాకర్ గ్రౌండ్ ఇంకా ఒక వాచ్ టవర్ ఉంది. ఈశాన్య ప్రాంతం లోని ఇతర రాష్ట్రాల లో గానే నాగాలాండ్ లో సాకర్ అనేది ప్రసిద్ది చెందిన ఆట. వసంత కాలంలో ఇక్కడి అనేక రకాల పూలను చూసి పర్యాటకులు మురిసిపోతారు. ఇక్కడి ప్రాంతీయ పక్షులు ఈ అందాలని రెట్టింపు చేస్తాయి.



Click it and Unblock the Notifications