వేద శిఖరం –కొన్యకుల భూమి మంత్రముగ్ద దృశ్యం
పాక్ కోయిగా కూడా పిలిచే వేద శిఖరం నాగాలాండ్ లోని మోన్ జిల్లాలో అతి ఎత్తైన శిఖరం. జిల్లా ప్రధానకేంద్రం నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేద శిఖరం నుండి మీరు అందమైన పర్వతాలు, నదుల మంత్రముగ్ధ దృశ్యాల అనుభూతిని పొందవచ్చు. ఈ శిఖరం నుండి ఒక నిర్మలమైన రోజున శక్తివంతమైన బ్రహ్మపుత్ర, చింద్విన నదులను కూడా చూడవచ్చు.
ఈ శిఖరం దగ్గరలో ఒక జలపాతం కూడా ఉంది. కొన్యక పల్లె ప్రాంత మొత్తం మీద ఈ జలపాతం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఎంతో అందమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణిస్తారు. బ్రిటిష్ సైనికులు తమ మొదటి శిబిరాలను ఇక్కడ నెలకొల్పినందున చారిత్రికంగా కూడా వేద శిఖరం ముఖ్యమైనది. నాగ కొండలలో బ్రిటష్ వారు మొట్టమొదటగా నల్లమందు మొక్కలను పెంచిన ప్రదేశం కూడా ఇదే. ఈ ప్రాంత అందం, అల్లకల్లోలమైన బ్రహ్మపుత్ర, చెక్కుచెదరని పరిసరాలు అన్ని కలసి మీకు జీవిత కాలానికి సరిపడే అనుభూతిని ఇస్తాయి.



Click it and Unblock the Notifications