మోరి లో ని జఖోల్ లో ఉన్న దుర్యోధన టెంపుల్ ప్రసిద్ది చెందిన పర్యాటక ఆకర్షణ. గొప్ప ఇతిహాసమైన మహాభారతం లో ని పౌరాణిక పాత్ర అయిన దుర్యోధనుడికి అంకితమివ్వబడిన అతి పెద్ద ఆలయం గా ఈ ఆలయాన్ని పరిగణిస్తారు.సౌర్ గ్రామం యొక్క నివాసితులు ఈ ఆలయాన్ని నిర్మించారని అంటారు. అంతే కాకుండా ఒస్లా, గంగర్ మరియు డట్మిర్కన్ వంటి ప్రాంతాలలో కౌరవులకు అంకితమివ్వబడిన ఆలయాలను గమనించవచ్చు. ఇక్కడ ఆసక్తి కరమైన విషయం, స్థానికులు కౌరవులు అలాగే పాండవులను తమ పుర్వికులుగా పేర్కొనడం.



Click it and Unblock the Notifications