లాల్ టిబ్బా ను ఇక్కడే ఒక డిపో వుండటం చేత డిపో హిల్ అని కూడా అంటారు. ఇక్కడ ఆకాశవాణి, దూరదర్శన్ టవర్లు కలవు. ఇండియన్ మిలిటరీ సర్వీసెస్ కొండపై వారి బేస్ క్యాంపు కలిగి వుంది. సూర్యొదయ , సూర్యాస్తమయాలు ఇక్కడ బాగుంటాయి. ఇక్కడ కల టెలీస్కోప్ నుండి సమీప ప్రదేశాలు కేదార్నాథ్, బందర్ పంచ్, బదరీనాథ్, మరియు హిమాలయ శ్రేణులు చూడవచ్చు. ఇంతే కాక పర్యాటకులు ఇక్కడ బ్రిటిష్ స్టైల్ నిర్మిత అనేక భవనాలు చూడవచ్చు.



Click it and Unblock the Notifications