నైనిటాల్ లో నైని సరస్సు ప్రధానాకర్షణ. చుట్టూ పచ్చని కొండలు కలవు. పర్యాటకులు ఇక్కడ యాచింగ్, రోఇంగ్ , పడ్డ్లింగ్ వంటివి చేయవచ్చు. ఇతిహాసాల మేరకు కన్ను ఆకారం లో వుండే ఈ సరస్సు హిందూ దేవత సతి యొక్క మృత్ శరీరపు కన్ను పడిన ప్రదేశంగా చెపుతారు. ఈసరస్సు ను 'ముగ్గురు ఋషుల సరస్సు' అనికూదాంటారు. ఈ పేరు స్కాందపురాణ లోని మానస్ ఖండ్ అధ్యాయం లో కలదు .
ఈ అధ్యాయం ముగ్గురు ఋషుల గురించి చెపుతుంది. వారు అత్రి,పులస్త్య,మరియు పులహ అనేవారు.వీరు వారి యాత్రలో దాహం వేసి నైనిటాల్ వద్ద ఆగారు. అక్కడ నీరు దొరకలేదు. వెంటనే వారు అక్కడ ఒక పెద్ద కన్నం వేసి మానస సరోవర్ సరస్సు నుండి అందులోకి నీటిని తెప్పించారు. ఫలితంగా నైని సరస్సు ఏర్పడింది.
ఈ సరస్సు చాలా పొడవైనది. ఉత్తరపు కోన ను మల్లితాల్ అని దక్షిణపు కొనను తల్లితాల్ అని అంటారు. ఈ సరస్సు పై ఒక వంతెన మరియు దానిపై ఒక పోస్ట్ ఆఫీస్ వుంటాయి. సమీపంలో ఒక బస్సు స్టేషన్,టాక్సీ స్టాండ్ , రైల్వే రిజర్వేషన్ల కౌంటర్ మరియు షాపింగ్ సెంటర్ లు కలవు.



Click it and Unblock the Notifications