Search
  • Follow NativePlanet
Share
» »తెలంగాణ వాసుల‌కు ద‌స‌రా, బ‌తుకమ్మ‌కానుక.. 6,304 స్పెష‌ల్ బస్సులు..

తెలంగాణ వాసుల‌కు ద‌స‌రా, బ‌తుకమ్మ‌కానుక.. 6,304 స్పెష‌ల్ బస్సులు..

తెలంగాణలోని ప్ర‌యాణికుల‌కు ఆర్‌టీసీ ఓ శుభ‌వార్త‌ను అందించింది. ద‌స‌రా, బ‌తుక‌మ్మ పండుగ‌ల సంద‌ర్భంగా స్పెష‌ల్ బ‌స్సుల‌ను న‌డుపుతున్న‌ట్లు అధికారులు తెలిపారు. అక్టోబ‌ర్ మాసంలో ద‌స‌రా, బ‌తుక‌మ్మ పండుగ‌లు ఉన్నాయి. ఇక‌, పండుగ‌లకు సొంతూళ్ల‌కు వెళ్లేవారికి తెలంగాణ ఆర్‌టీసీ ప్ర‌త్యేక బ‌స్సుల‌ను నడుపుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.

ఇక, ఈ సంవ‌త్స‌రం నుంచి మహాలక్ష్మీ పథకం అమలవడం వల్ల దసరాకు ఈసారి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలంగాణ ఆర్‌టీసీ ఎండీ వెల్లడించారు. బతుకమ్మ, దసరా పండుగ‌ల రద్దీ క్ర‌మంలో పోలీసు, రవాణా శాఖ అధికారుల సహకారం కోరుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వివ‌రించారు. ఈ ఏడాది రద్దీ అదనంగా ఉండడం వల్ల 600 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సజ్జనార్ తెలిపారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6304 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఈ ప్రత్యేక బస్సులు అక్టోబర్ 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

ఈ ప్రాంతాల్లో ర‌ద్దీ...

స‌ద్దుల బ‌తుక‌మ్మ, దసరా పండుగులకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ తరపున అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయ‌న వివరించారు. ఈసారి మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం కూడా అమ‌ల్లో ఉన్న క్ర‌మంలో గ‌త సంవ‌త్స‌రంతో పోల్చితే ఈసారి రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందని భావించి, గ‌త ఏడాది కంటే ఎక్కువ‌గా 600 ప్ర‌త్యేక బ‌స్సు స‌ర్వీసుల‌ు నడిపించాలని నిర్ణయించినట్టు ఎండీ సజ్జనార్ వివ‌రించారు.

busesfortelanganaresidents

దసరా ఆపరేషన్లను సమీక్షించేందుకు హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో పోలీసు, రవాణా శాఖ అధికారులతో ఎండీ సజ్జనార్ స‌మావేశ‌మై ఆర్టీసీ అధికారులకు కీలక సూచనలు చేశారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్, ఆరాంఘర్, ఐఎస్ సదన్, బొరబండ, శంషాబాద్, కూకట్‌పల్లి, ఎంజీబీఎస్, జేబీఎస్,గచ్చిబౌలి, బోయిన్‌పల్లి, జగద్గిరిగుట్ట, సుచిత్రలలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేసి, ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామ‌ని ఆయ‌న వివ‌రించారు. రద్దీ ఉన్న ప్రాంతాల్లో పర్యవేక్షణ అధికారులను నియమించినట్లు తెలిపారు.

జేబీఎస్ నుంచి 1602 బ‌స్సులు..

హైదార‌బాద్‌లో రద్దీ ఎక్కువగా ఉండే పలు ప్రాంతాల నుంచి ఎక్కువ బస్సులు నడుపుతున్నట్లు ఆయ‌న పేర్కొన్నారు. ముఖ్యంగా న‌గ‌రంలోని జేబీఎస్ నుంచి 1602 బ‌స్సులు, ఎల్బీనగర్ నుంచి 1193 బ‌స్సులు, ఉప్పల్ నుంచి 585 బ‌స్సులు, ఆరాంఘర్ నుంచి 451 అదనపు బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణం రద్దీ ఎక్కువగా ఉండే అక్టోబర్ 13, 14 తేదీల్లోనూ ఈ స్పెష‌ల్ బ‌స్సు స‌ర్వీసులు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటాయ‌ని ఆయ‌న వివ‌రించారు.

ప్రతి రద్దీ ప్రాంతం వద్ద పర్యవేక్షణ అధికారులను కూడా ఉన్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసిన‌ట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. బతుకమ్మ, దసరా ప్రత్యేక బ‌స్సు సర్వీసుల కోసం ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలంటే తెలంగాణ ఆర్‌టీసీ అధికారిక వెబ్ సైట్ http://tgsrtcbus.in ను సంప్ర‌దించాల‌న్నారు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+