Search
  • Follow NativePlanet
Share
» »వాహ‌నదారుల‌కు అల‌ర్ట్‌.. నేటి నుంచి హైద‌రాబాద్‌లోని ప‌లు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు..

వాహ‌నదారుల‌కు అల‌ర్ట్‌.. నేటి నుంచి హైద‌రాబాద్‌లోని ప‌లు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు..

హైద‌ర‌బాద్ న‌గ‌రంలోని వాహ‌న‌దారుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌.. ప‌ట్ట‌ణంలో ఫ్లైఓవ‌ర్ల నిర్మాణం కార‌ణంగా ప‌లు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ ట్రాఫిక్ ఆంక్ష‌లు నేటి (మంగ‌ళ‌వారం) నుంచి ఐదురోజుల‌పాటు కొన‌సాగ‌నున్నాయి. కావున‌, ఉద్యోగ‌స్తులు ఆఫీసుకు వెళ్లాలన్న గాబరాలో ఈ మార్గాల్లో ప్ర‌యాణించారా.. ఇక అంతే.. మీరు ఆఫీసుకు లేటుగా వెళ్లిన‌ట్లే.. కాబట్టి ప‌ట్ట‌ణంలో ఏయే మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉన్నాయో ముందుగా చూసుకుని వెళ్లడం ఉత్త‌మమైన ప‌ని. ఈ మార్గాల గురించి తెలుసుకోవ‌డంతో పాటు రోజూ మాదిరిగా కాకుండా ఆఫీసుకు ఒక పదినిమిషాలు ముందే బయలుదేరితే మంచిది.

ఐదురోజుల‌పాటు ట్రాఫిక్ ఆంక్ష‌లు..

ప్లైఓవ‌ర్ల‌ నిర్మాణ పనులు కారణంగా పలుమార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేసిన‌ట్లు పేర్కొన్నారు. ఈ మార్గాల్లో వెళ్లాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. ఐటీ కారిడార్‌ గచ్చిబౌలి ప‌రిధిలోని ఎస్‌ఆర్‌డీపీ శిల్పా లేఅవుట్‌ ఫేజ్‌-2 వద్ద ప్లైఓవ‌ర్లు నిర్మాణం ప‌నులు వేగ‌వంతంగా జ‌రుగుతున్నాయి. అయితే ఈ మార్గంలో వాహానాల‌ను నిలిపివేసిన‌ట్లు అధికారులు తెలిపారు. ప‌లు వాహనాల రాకపోకలతో ప్లైఓవ‌ర్ నిర్మాణం పనులకు ఆటంకం క‌లుగుతుంద‌ని భావించిన సైబరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. దీంతో ఈ మార్గంలో ఐదురోజులపాటు రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు.

అంబర్‌పేట-గోల్నాక మార్గాల్లో..

ఈ ట్రాఫిక్ ఆంక్ష‌లు కొత్తగూడ-రోలింగ్‌ హిల్స్ దారిలోని గచ్చిబౌలి జంక్షన్‌ వరకు కొన‌సాగ‌నున్న‌ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. జెడ్‌పీహెచ్‌ఎస్ యూటర్న్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులు ఇత‌ర ప్రత్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల్సిందిగా అధికారులు కోరారు. అలాగే, అంబర్‌పేటలోనూ ట్రాఫిక్ ఆంక్షలు కొన‌సాగుతున్న‌ట్లు అధికారులు తెలిపారు. అంబ‌ర్‌పేట‌ ప్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా అంబర్‌పేట-గోల్నాక మార్గాల్లో ప‌లు వాహనాల రాకపోకలను నియంత్రించినట్లు ట్రాఫిక్ అధికారులు వివ‌రించారు.

Traffic restrictions on many roads in Hyderabad from today

ఈ మార్గాల్లో ప్లైఓవర్ పనులు పూర్తయ్యేంత‌ వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు. ట్రాఫిక్ కార‌ణంగా 6 వ నెంబర్ ర‌హ‌దారిలోని జంక్షన్ నుంచి గోల్నాక్ వెళ్లే మార్గంలో వాహనాలను జిందా తిలిస్మాత్‌ రోడ్డులోకి మళ్లిస్తున్న‌ట్లు తెలిపారు. గోల్నాక నుంచి 6వ నెంబర్ జంక్షన్ వరకు మాత్రం ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండానే వాహనాలను అనుమతిస్తున్న‌ట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ఎన్‌సీసీ గేట్ నుంచి 6వ నెంబర్ జంక్షన్ వరకు వచ్చే ఆర్టీసీ బస్సులను తిలక్‌నగర్ అడ్డురోడ్డులోని ఫీవర్ ఆస్పత్రి వైపు మళ్లించిన‌ట్లు పేర్కొన్నారు. కావున‌, ఆయా ర‌హ‌దారుల్లో వెళ్లే వాహనదారులు ఇత‌ర ప్రత్నామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని అధికారులు కోరారు. తప్పకుండా అదే మార్గాల్లో వెళ్లాల్సిన వారు మాత్రం కొద్దిసేపు ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌ను ఎందుర్కొవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

నెలరోజుల్లోనే ఫ్లైఓవ‌ర్ పూర్తి...

ఇక‌, ఈ ప్లైఓవర్ల నిర్మాణం పూర్త‌యితే మాత్రం ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా సాఫీగా వాహనాలు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. కాబట్టి వాహ‌నాదారులు మ‌రికొన్నిరోజులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొక తప్పదన్నారు. నెలరోజుల్లోనే అంబర్‌పేట పైవంతెనను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శరవేగంగా పనులు సాగుతున్నాయ‌ని అధికారులు చెబుతున్నారు. అందుకే ట్రాఫిక్ మళ్లించి మరీ పనులు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి వాహ‌న‌దారులంతా సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు కోరారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+