Search
  • Follow NativePlanet
Share
» »ఏపీలోని రైలు ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. రెండు స్పెష‌ల్ ట్రైన్స్‌..

ఏపీలోని రైలు ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. రెండు స్పెష‌ల్ ట్రైన్స్‌..

ఏపీలోని రైలు ప్ర‌యాణికుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌.. ప్రయాణీకుల రద్దీని క్లియర్ చేసేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మీదుగా రెండు ప్రత్యేక రైళ్ల‌ను న‌డ‌పాల‌ని రైల్వేశాఖ‌ నిర్ణ‌యించింది. ఇందులో భాగంగానే కోయంబత్తూర్-బరౌని-కోయంబత్తూర్ మ‌ధ్య ఈ స్పెష‌ల్ ట్రైన్స్ న‌డ‌వ‌నున్నాయి. దానా తుఫాను ప్ర‌భావంతో 15 రైళ్లను ర‌ద్దు చేసిన‌ట్లు రైల్వేశాఖ తెలిపింది.

కోయంబత్తూరు - బరౌని స్పెష‌ల్ ఎక్స్‌ప్రెస్..

అందులో ఒక‌టి 06055 అనే నెంబ‌ర్‌గ‌ల‌ కోయంబత్తూరు - బరౌని స్పెష‌ల్ ఎక్స్‌ప్రెస్ అక్టోబ‌ర్ 26 నుండి న‌వంబ‌ర్ 16 వ‌ర‌కు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. ఈ ప్ర‌త్యేక ట్రైన్ శనివారాల్లో ఉద‌యం 11.50 గంటలకు కోయంబత్తూరులో స్టార్ట్ అవుతుంది. అక్క‌డినుండి మరుసటి రోజు అంటే ఆదివారం ఉద‌యం 10.48 గంటలకు దువ్వాడ స్టేష‌న్‌కు చేరుకుంటుంది. మ‌ధ్యాహ్నం 1.25 గంటలకు విజయనగరం స్టేష‌న్‌కు చేరుకుంటుంది. బొబ్బిలి స్టేష‌న్‌కు మ‌ధ్యాహ్నం 2.23 గంటలకు చేరుకుంటుంది. ఆ త‌ర్వాత మ‌ధ్యాహ్నం 2.50 గంటలకు పార్వతీపురం స్టేష‌న్‌కు చేరుకుంటుంది. సోమ‌వారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు బ‌రౌని స్టేష‌న్‌కు చేరుకుంటుంది.

బరౌని - కోయంబత్తూరు స్పెష‌ల్ ఎక్స్‌ప్రెస్..

రెండో స్పెష‌ల్ ట్రైన్ 06056 అనే నెంబ‌ర్‌గ‌ల బరౌని - కోయంబత్తూరు స్పెష‌ల్ ఎక్స్‌ప్రెస్ ఈ ట్రైన్ అక్టోబ‌ర్ 29 నుండి న‌వంబ‌ర్ 19 వరకు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. ప్ర‌తి మంగళవారాల్లో రాత్రి 11:45 గంటలకు బరౌని నుండి ఈ స్పెష‌ల్ ట్రైన్ ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. మరుసటి రోజు రాత్రి 11.25 గంటలకు రాయగడ చేరుకుంటుంది. ఆ త‌ర్వాత అర్థ‌రాత్రి 12.15 గంటలకు పార్వతీపురం స్టేష‌న్‌కు చేరుకుంటుంది. బొబ్బిలి స్టేష‌న్‌కు అర్థ‌రాత్రి 12.40 గంటలకు చేరుకుంటుంది. అదే రోజు అర్థ‌రాత్రి 1.04 గంటలకు విజయనగరం స్టేష‌న్‌కు చేరుకుంటుంది. మ‌రుస‌టి రోజు తెల్ల‌వారుజామున 3.48 గంటలకు దువ్వాడ స్టేష‌న్‌కు చేరుకుంటుంది. కోయంబ‌త్తూరు స్టేష‌న్‌కు శుక్ర‌వారం తెల్ల‌వారుజామున 3:50 గంటలకు చేరుకుంటుంది.

twospecialtrains

ఈ స్టేష‌న్ల‌లో ఆగుతాయి...

ఈ రెండు ప్ర‌త్యేక రైళ్లు ఏపీలోని గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, బొబ్బిలి, పార్వ‌తీపురం స్టేష‌న్ల‌లో ప్ర‌యాణికుల కోసం ఆగుతాయి. ఈ స్పెష‌ల్ ట్రైన్స్ థ‌ర్డ్ ఏసీ-6, స్లీపర్ క్లాస్-08, జనరల్ సెకండ్ క్లాస్-1, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/దివ్యాంగజన్ కోచ్‌లు-01, జనరేటర్ మోటార్ కార్-1 కోచ్ వంటి సౌక‌ర్యాల‌ను క‌లిగి ఉన్నాయి. వీటితోపాటు వెయిటింగ్ లిస్ట్, ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేసేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్... విశాఖపట్నం-కిరండూల్-విశాఖపట్నం ట్రైన్‌కు అదనపు విస్టాడోమ్ కోచ్‌ను కూడా జోడించాలని నిర్ణయించింది. అక్టోబ‌ర్ 26వ తేదిన 08552 అనే నెంబ‌ర్‌గ‌ల కిరండూల్-విశాఖపట్నం ట్రైన్‌కు ఈ అదనపు విస్టాడోమ్ కోచ్ అందుబాటులో ఉంటుంది. ఈ సేవలను ప్ర‌యాణికుల‌కు వినియోగించుకోవాలని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.

తుఫాన్ ఎఫెక్ట్ ప‌లు రైళ్లు రద్దు

దానా తుఫాన్ కార‌ణంగా రైల్వే శాఖ పలు రైళ్లను కూడా రద్దు చేసింది. ఇందులో భాగంగా అక్టోబ‌ర్ 27వ (ఆదివారం) తేదీన మూడు రైళ్లు ర‌ద్దు కానున్నాయి. 28వ తేదీన ఒక ట్రైన్‌ రద్దు కానుంది.

27 (ఆదివారం) తేదీన ర‌ద్ద‌య్యే రైళ్లు ఇవే..

12510 అనే నెంబ‌ర్‌గ‌ల గౌహతి- ఎస్ఎంవీటీ బెంగళూరు ట్రైన్

18048 అనే నెంబ‌ర్ గ‌ల వాస్కోడగామా-షాలిమార్ అమరావతి ఎక్స్‌ప్రెస్ ట్రైన్

20895 అనే నెంబ‌ర్‌గ‌ల రామేశ్వరం-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్

28 (సోమ‌వారం) తేదీన ర‌ద్ద‌యిన ట్రైన్‌.

03430 అనే నెంబ‌ర్‌గ‌ల మాల్దా టౌన్ - సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌..

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+