బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్...
బెంగుళూరును సందర్శించాలనుకునే పర్యాటకులకు అలర్ట్. సెప్టెంబర్ 26వ తేది బంద్‌కు వివిధ సంస్థలు పిలుపునిచ్చాయి. తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయొద్దంటూ రాష్ర్టప్రభుత్వాన్ని కోరుతూ కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ను ప్రకటించాయి. కావున, ఈ సమయంలో బెంగుళూరును పర్యటించాలనుకునేవారు వారి ప్రయాణాన్ని విరమించుకుంటే మంచిది. రైతు సంఘాలు, కన్నడ అనుకూల సంస్థలు మంగళవారం బెంగళూరు స్వచ్ఛందంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. కాబట్టి నగరంలో అనేక కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 175కి పైగా సంస్థలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తున్న రైతు సంఘాలకు ఈ సంస్థలన్నీ మద్దతుగా నిలిచాయి.

ఈ పార్టీలు బంద్‌కు మద్దతు పలికాయి..
పాఠశాలలు, కళాశాలలు, ఐటీ కంపెనీలు, ఫిలిం ఛాంబర్‌కు సెలవు ప్రకటించాలని రైతు సంఘం నాయకుడు కురుబూరు శాంతకుమార్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 26న ఉదయం 11 గంటలకు టౌన్‌హాల్ నుంచి మైసూరు బ్యాంక్ సర్కిల్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. బంద్ మద్దతుదారులలో రైతు సంఘాల సమాఖ్య, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), కర్ణాటక చెరకు ఉత్పత్తిదారుల సంఘం, బెంగళూరు నవనిర్మాణ పార్టీ, KSRTC స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, అసోసియేటెడ్ మేనేజ్‌మెంట్స్ ఆఫ్ ప్రి వంటి వారు ఉన్నారు.
ఈ సర్వీసులు మూసివేయబడతాయి..
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ 'బెంగళూరు బంద్'కు తన పూర్తి మద్దతును అందించింది. KSRTC, BMTC సర్వీసులు రెండూ బంద్‌కు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సర్వీసులు మంగళవారం అందుబాటులో ఉండకపోవచ్చు. ఇంకా ప్రయివేట్ క్యాబ్ సేవలు అంటే, ఓలా వంటివి ఉబర్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తన్వీర్ పాషా బంద్‌కు మద్దతు ప్రకటించి మంగళవారం రోడ్లపైకి రాకుండా నిర్ణయం తీసుకున్నారు. "భూమి, భాష, నీటి విషయంలో ఎలాంటి రాజీ ఉండదు అంటూ ఎటువంటి రెండో ఆలోచన తావు లేకుండా బంద్‌కు మద్దతిస్తున్నాం'' అని పాషా బంద్‌కు మద్దతు తెలిపారు. కాబట్టి మంగళవారం ఎటువంటి క్యాబ్ సేవలు కూడా అందుబాటులో ఉండవు అనే విషయాన్ని పర్యాటకులు గమనంలో ఉంచుకోవాలి.

పాఠశాలలు, కళాశాలలు బంద్‌కు మద్దతిచ్చాయి..
చేతులకు నల్ల బ్యాండ్‌లు కట్టుకుని మద్దతు పలుకుతామని ప్రయివేట్ స్కూల్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శశికుమార్ తెలిపారు. కానీ ఇంకా చాలా పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించలేదు. దీనిపై నేడు నిర్ణయం తీసుకోనున్నారు.
రెస్టారెంట్లు, వాణిజ్య సంస్థలు
హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్లు బంద్‌కు తమ మద్దతును అందించాయి. మంగళవారం తమ అవుట్‌లెట్లను మూసివేస్తామని చెప్పారు. నగరంలోని అన్ని రెస్టారెంట్ల యజమానులు తమ సంస్థలను ఒక రోజు మూసి ఉంచాలని వారు కోరారు. కాబట్టి మంగళవారు బంద్ సందర్భందంగా ఎక్కడా ఏ హోటల్ కూడా తెరిచే అవకాశం ఉండదు.
ఏ సేవలు తెరవబడతాయి?
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మంగళవారం నగరమంతటా మెట్రో సేవలను నడుపుతోంది. బెంగుళూరులోని నమ్మ మెట్రో రైలు మార్గంలో ఎలాంటి అంతరాయాలు ఉండవు. అంబులెన్స్‌లు, ఫార్మా వాహనాలు, ఇతర ముఖ్యమైన వస్తువుల రవాణా వాహనాలు వంటి అన్ని అత్యవసర సేవల సంబంధిత వాహనాలు పని చేస్తాయి. ఆసుపత్రులు, మెడికల్ స్టోర్లు కూడా యథావిధిగా నడిచే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications













