తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పర్యాటకులకు వీక్షించేందుకు అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ చాలా మందికి నెక్లెస్ రోడ్ అంటే ఎంతగానో నచ్చుతుంది. ఆ రోడ్ అంతా విశాలంగా ఉండకపోయినా, పర్యాటకులను ఎంతగానో ఆకట్టకుంటుంది. ఎందుకంటే సుమారు నాలుగు కిలోమీటర్ల రోడ్డుకి పక్కన చాలా పార్కులు ఈ రోడ్డులో ఉంటాయి. నెక్లెస్ రోడ్డు అనగానే ప్రకృతి ప్రేమికులకు ఎంతగానో నచ్చుతుంది. అయితే, ఈ రోజు మనం చెప్పుకోబోయేది ఏంటటే.. నెక్లెస్ రోడ్‌లో ప్రారంభం కాబోతున్న ఓ మేళా గురించి..
నగరంలో నెక్లెస్ రోడ్‌లో నేడు ఆల్ ఇండియా హార్టికల్చర్ మేళా కార్యక్రమం జరగబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా మేళా ఇన్‌చార్జి ఖలీద్ అహ్మద్ వివరించారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ ఉత్పత్తులతో 16వ ఆలిండియా హార్టికల్చర్ మేళాను ప్రారంభించనున్నట్టు మేళా ఇన్‌చార్జి వివరించారు. ఈ మేళాలో భాగంగా ఇక్కడ గ్రాండ్ నర్సరీ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచుతారు.
ఇందులో చాలా రకాల మొక్కలుంటాయి. వాటిని చూసి, నచ్చితే ప్రజలు వాటిని కోనుగోలు కూడా చేయొచ్చు. మొక్కలు పెంచుకోవడం వల్ల ఇంటి పర్యావరణం ఎంతో బాగుంటుంది. మనసు కూడా ఎంతో ఆహ్లదకరంగా ఉంటుంది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో నేటి (గురువారం) నుంచి సెప్టెంబర్ 2 వరకు ఐదురోజులపాటు ఈ మేళా కొనసాగనుంది. ఈ మేళాను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, హార్టికల్చర్ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ప్రారంభించనున్నారు.

150కి పైగా స్టాళ్లు...
ఈ మేళాలో విభిన్న రకాల మొక్కలు, కుండీలు, గార్డెనింగ్ వస్తువులు పర్యాటకులను ఆకట్టుకుంటోంది. నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా జరుగుతున్న ఈ అఖిలభారత ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శన ప్రకృతి ప్రేమికులకు సాదర ఆహ్వానం పలుకుతోంది. ఈ ఉద్యానవన ప్రదర్శనలో వర్టికల్ గార్డెనింగ్, టెర్రస్ గార్డెనింగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.
ఇందులో దేశంలోని వివిధ నగరాల నుంచి 150కి పైగా స్టాళ్లు కొలువుదీరనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేళాలో దేశవాళీ సంకర కూరగాయలు, పూలు, పండ్ల మొక్కలు, విత్తనాలను ప్రదర్శనకు ఉంచుతారు. పర్యాటకులను ఆకట్టుకునే చూడచక్కని కుండీలు, సహజ ఎరువులు, యంత్రాలు ఇక్కడికి వచ్చే సందర్శకులను ఇట్టే కట్టిపడేస్తాయంటే నమ్మండి.

వివిధ రకాల మొక్కలు..
ఈ ఉద్యానవన ప్రదర్శన ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పర్యాటకులకు అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు మేళా ఇన్‌ఛార్జీ బుధవారం ప్రత్యేక బ్రౌచర్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ మేళాలో టెర్రస్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్ సిస్టమ్ వంటి నూతన పద్ధతులను ప్రదర్శిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఏపీ, కోల్‌కతా, ఢిల్లీ, హర్యానా, ముంబై, బెంగళూరు, పుణె, షిర్డీ, కడియం, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ప్లాంట్స్‌తో 150 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. వివిధ రకాల మొక్కలు ఈ స్టాల్స్‌లో ఏర్పాటు చేస్తారు. అరుదైన జాతుల పువ్వులు.. రకరకాల మొక్కలు ఈ మేళాలో పర్యాటకులను ఆహ్లాదపరచనున్నాయి. ఈ మేళాలో ఇంకా వివిధ రకాల పూల మొక్కలు, పండ్ల జాతులు, విత్తనాలు, ఆర్గానిక్ ఉత్పత్తులు, అగ్రికల్చర్ సైన్స్, మొక్కల పెంపకానికి ఉపయోగపడే పరికరాలు, వస్తువులు ఉంటాయి.



Click it and Unblock the Notifications













