Search
  • Follow NativePlanet
Share
» »ఫిబ్ర‌వ‌రి 2 నుంచి తెరుచుకోనున్న రాష్ట్రపతి భవన్‌లోని అమృత్‌ ఉద్యానవనం...

ఫిబ్ర‌వ‌రి 2 నుంచి తెరుచుకోనున్న రాష్ట్రపతి భవన్‌లోని అమృత్‌ ఉద్యానవనం...

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని అమృత్‌ ఉద్యానవనం మరోసారి సామాన్యుల కోసం తెరవబోతోంది. ఈ ఉద్యాన‌వనాన్ని సంద‌ర్శించాల‌నుకునేవారికి ఇదొక సువ‌ర్ణావకాశమ‌నే చెప్పుకోవాలి. ఫిబ్రవరి 2 నుండి మార్చి 31 వరకు ఎప్పుడైనా ఇక్కడ సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. అమృత్ ఉద్యాన్‌లో ఏర్పాటు చేసిన వివిధ రకాల పువ్వులు, ఫౌంటైన్‌లు, వృత్తాకార ఉద్యానవనాల అందాలను దగ్గరగా చూసే అవ‌కాశం ఉంటుంది.

ఇక్కడికి వెళ్లడానికి టిక్కెట్లు ఎలా బుక్ చేసుకోవాలి, ఏ మెట్రో స్టేషన్ దగ్గర్లో ఉంటుంది, ఏ గేట్ ఎంట్రీ పాయింట్ అవుతుంది వంటి ముఖ్యమైన విష‌యాల‌ను తెలుసుకోవాలంటే ఈ ఆర్టిక‌ల్ చ‌ద‌వాల్సిందే. ఈ ఉద్యాన‌వనం మార్చి 31 వరకు తెరిచి ఉంటుంది. కాబ‌ట్టి ఎవ‌రైనా సరే ఈ గార్డెన్‌ను సంద‌ర్శించాల‌నుకుంటే మాత్రం త‌ప్ప‌కుండా ఈ వివ‌రాలు తెలుసుకోవాల్సిందే.

amritgarden

అమృత్ ఉద్యాన ప్రవేశ సమయం..

అమృత్ ఉద్యానవ‌నాన‌న్ని సంద‌ర్శించేందుకు ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అయితే సాయంత్రం 5 గంటల వరకు గార్డెన్‌ని సందర్శించవచ్చు. పార్కు సందర్శనకు వచ్చే ప్రజలు 6 స్లాట్లలో సంచరించవచ్చు. రెండు స్లాట్‌లు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరవబడతాయి. ఒకే స్లాట్‌లో 7500 మంది కలిసి ఈ గార్డెన్‌ని వీక్షించొచ్చు. వారాంతాల్లో, ప్రతి షిఫ్ట్‌లో 10,000 మంది వ్యక్తులు పార్కును సందర్శించడానికి అనుమతించబడతారు. అదేవిధంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నాలుగు షిఫ్టుల్లో 5000 మందిని, వారాంతాల్లో 7500 మందిని మాత్ర‌మే ఈ ఉద్యానవ‌నంలోకి అనుమ‌తించ‌డం జ‌రుగుతుంది.

ఈ రోజున అమృత్ ఉద్యానవ‌నం ప్రారంభం కానుంది...

ఫిబ్రవరి 22న వికలాంగులకు అమృత్ ఉద్యాన, ఫిబ్రవరి 23న రక్షణ, పారామిలటరీ మరియు పోలీసు సిబ్బంది కోసం, మహిళలు మరియు గిరిజన మహిళల స్వయం సహాయక సంఘాలకు మార్చి ఒక‌ట‌వ తేదీన‌, అనాథాశ్రమాల పిల్లల కోసం మార్చి 5 ఈ ఉద్యాన‌వ‌నం ప్ర‌త్యేకంగా కేవ‌లం వారికోసం మాత్ర‌మే తెర‌వ‌బ‌డుతుంది.

amritgarden , rashtrapathi bhavan

టిక్కెట్లు కొనుగోలు చేయు విధానం...

అమృత్ ఉద్యానాన్ని సందర్శించడానికి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ బుకింగ్ కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రపతి భవన్ వెబ్‌సైట్ visit.rashtrapatibhavan.gov.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా, రాష్ట్రపతి భవన్‌లో అమర్చిన కియోస్క్ మిషన్ నుండి కూడా టిక్కెట్లు తీసుకోవచ్చు. అక్కడ ఉన్న కౌంటర్ నుండి కూడా తీసుకోవచ్చు. అమృత్ ఉద్యాన్‌తో పాటు, పర్యాటకులు రాష్ట్రపతి భవన్ మ్యూజియాన్ని కూడా సందర్శించవచ్చు, అయితే దీని కోసం వారు తమ స్లాట్‌ను ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

అమృత్ ఉద్యాన్‌కు వెళ్లేందుకు సమీప మెట్రో స్టేషన్...

మెట్రోలో ఉద్యాన‌వ‌నం చేరుకోవాల‌ని అనుకుంటే మాత్రం సెంట్రల్ సెక్రటేరియట్ సమీపంలోని మెట్రో స్టేషన్. నార్త్ ఎవెన్యూ సమీపంలోని రాష్ట్రపతి భవన్‌లోని గేట్ నెం. 35 నుండి సాధారణ ప్రజలకు ప్రవేశం ఉంటుంది. దీని కోసం సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ నుండి షటిల్ బస్సు సర్వీస్ ఉదయం 9.30 నుండి సాయంత్రం 5.00 గంటల మధ్య ప్రతి 30 నిమిషాల వ్యవధిలో అందుబాటులో ఉంటుంది. ఈ ఉద్యాన‌వ‌నంలోకి వెళ్లేవారు తమ వెంట మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ కీలు, పర్సులు/ హ్యాండ్‌బ్యాగ్‌లు, వాటర్ బాటిళ్లు మరియు పిల్లలకు పాల సీసాలు వంటి లోప‌లికి తీసుకెళ్లవచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+